వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను గుర్తుంచుకోండి: అభిమానులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు చురకలు

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: జనసేన కవాతుకు సర్వం సిద్ధమైంది. అంతలోనే పోలీసులు మెలిక పెట్టారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అయితే అనూహ్యంగా కవాతు, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలం కాదని తెలిపారు.

<strong>'సైకో జగన్ పారిపోయారు, అలవెన్స్‌లు తీసుకోవద్దు, పవన్ కళ్యాణ్ నీ మాటేమిటి'</strong>'సైకో జగన్ పారిపోయారు, అలవెన్స్‌లు తీసుకోవద్దు, పవన్ కళ్యాణ్ నీ మాటేమిటి'

మరోవైపు, కవాతుకు జనసేన సిద్ధమైంది. ఇదిలా ఉండగా, జనసేన కవాతు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుగానే అభిమానులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులను గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

క్షేమంగా వచ్చి వెళ్లండి

క్షేమంగా వచ్చి వెళ్లండి

'కవాతులో పాల్గొనబోతున్న జనసైనికులందరికి నా విన్నపం, అభ్యర్ధన : మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి, ఒక క్రమశిక్షణ తో ముందుకు వెళదాం, కలిసి నడుద్దాం , ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా అప్రమత్తముగా ఉండండి.' జన సైనికులు మన కవాతుకు అండగా ఉన్న ఆడపడుచులకు, మహిళా శక్తికి మీరు రక్షణ కవచంలా నిలబడాలని సూచించారు. తల్లి భవానీ దేవి అనుగ్రహం పొందాలని చెప్పారు.

కవాతు లక్ష్యం

కవాతు లక్ష్యం

కవాతు మన లక్ష్యం కోసమని, కవాతు మన ధ్యేయం కోసంని, కవాతు మన రేపటి భవిష్యత్తు కోసమని, ఇది మన బిడ్డల కోసమని పవన్ కళ్యాణ్ చెప్పారు. కవాతు కోసం ప్రతి జన సైనికుడు ముందుకు కదలాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

యువతకు సూచనలు

యువతకు సూచనలు

జన సైనికులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పైన వచ్చే యువత వేగం చూపవద్దని, ఉత్సాహన్ని కవాతులో మాత్రమే ప్రదర్శించాలని, బైక్ యాక్సిలేటర్ ధ్వనులతో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇంటి నుంచి జాతీయ స్ఫూర్తితో కవాతుకు రావాలని, మళ్లీ క్షేమంగా వెళ్లాలన్నారు. మీ క్షేమం నాకు ప్రథమ బాధ్యత అని పవన్ చెప్పారు. బైకుల్లో వేగంగా వెళ్లేటప్పుడు మీ తల్లిదండ్రులను, తనను గుర్తు పెట్టుకోవాలన్నారు.

చంద్రబాబుకు చురకలు

చంద్రబాబుకు చురకలు

అలాగే, ప్రత్యేక హోదా పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా చురకలు అంటించారు. ప్రత్యేక హోదాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయి. వాటిని అన్నింటిని ఒకవద్ద కూర్చి పోస్ట్ చేశారు.

Recommended Video

కవాతుకు సిద్ధమౌతున్న జనసేన..!

English summary
Janasena cheif Pawan Kalyan suggestion for fans and Janasainiks before Jana Sena Kavathu in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X