సీఎం జగన్ - చంద్రబాబును డామినేట్ చేసిన పవన్ : గేమ్ ఛేంజర్..!!
ఏపీలో హోరా హోరీ రాజకీయం నడుస్తోంది. రానున్న ఎన్నికలకు ముందస్తుగానే పార్టీలు సిద్దం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వర్సస్ చంద్రబాబు అన్నట్లుగా సాగుతున్న రాజకీయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకంగా మారుతున్నారు. ఈ సారి పవన్ కల్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని జనసైనికులు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నేతల రాజకీయ అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి. ఇదే సమయంలో పవన్ రాజకీయంగా దూకుడు పెంచారు. కొన్ని అంశాల్లో సీఎం జగన్ ..టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ డామినేట్ చేసే విధంగా ముందుకెళ్తున్నారు.

ముగ్గురు నేతల హోరాహోరీ
రానున్న ఎన్నికల దిశగా సీఎం జగన్, చంద్రబాబు, పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ధీమాగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమదే అధికారమని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటు పవన్ వైసీపీని ఓడించే బాధ్యత తనదేనని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో సోషల్ మీడియా ఇప్పుడు ముగ్గురు నేతలకు కీలకంగా మారుతోంది. 2014లో ప్రధాని మోదీ విజయం వెనుక సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించింది. 2019లో ఏపీలో వైసీపీ మద్దతు సోషల్ మీడియా యాక్టివ్ గా వ్యవహరించింది. ఇప్పుడు చంద్రబాబు నమ్ముకున్న రాజకీయ వ్యూహకర్తలు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగానే ప్రజలకు పార్టీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తొలి స్థానంలో పవన్ కల్యాణ్
ఇప్పుడు ముగ్గురు నేతల వ్యక్తిగత సోషల్ మీడియాలో మద్దతు దారుల సంఖ్య ఆసక్తి కరంగా ఉంది. ముగ్గురిలో జనసేన అధినేత పవన్ తొలి స్థానంలో ఉన్నారు. అందునా పొలిటికల్ - సినీ రంగాలకు సంబంధించి ట్విట్టర్ ఖాతాలు కీలకంగా మారాయి. ఏపీకి చెందిన ముగ్గురు నేతల ఫాలోవర్స్ చూస్తే పవన్ కు అత్యధికంగా ఉన్నారు. రాజకీయం- సినీ అభిమానుల మద్దతు ఉన్న జనసేనాని పవన్ కు ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫాలోవర్స్ 4.9 మిలియన్ల మంది ఉన్నారు. సీఎం జగన్ ట్విట్టర్ ఖాతాను 2.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇక, ఈ ముగ్గరి నేతలు..వారి పార్టీలకు మద్దతుగా అనేక ఖాతాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఎన్నికల వేళ ఇదే కీలకంగా..
ఎన్నికలకు సిద్దం అవుతున్న ప్రచార వ్యూహాలు కీలకంగా మారుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మద్దతు దారులు చేసే ప్రచారం ప్రభావం చూపుతోంది. ముఖ్యమంత్రి జగన్ తనను లక్షంగా చేసుకొని వ్యవహరిస్తున్న మీడియా పైన ఫైర్ అవుతున్నారు. అందులో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరుతున్నారు. అటు చంద్రబాబుకు ఒక సెక్షన్ మీడియా మద్దతుగా ఉంటోంది. ఇక జనసేనానికి ఒకటి రెండు మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ, పవన్ కు అటు పొలిటికల్..ఇటు సినీ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంంది. అదే సమయంలో పవన్ పొలిటికల్ కామెంట్స్ కు ఈ మధ్య కాలంలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్నికలు సమీపించే వేళ సోషల్ మీడియా ఈ మూడు పార్టీలకు బలమైన వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?











Click it and Unblock the Notifications