నేను వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రి - పవన్ కల్యాణ్..!!
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు జనసేన అండగా నిలుస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దెబ్బ తిన్న ప్రతీ గింజకు ప్రభుత్వం పరిహారం చెల్లించేవరకూ పోరాడతామని స్పష్టం చేసారు. ప్రతిపక్ష పార్టీలు వస్తే గానీ ధాన్యం కొనరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం తాను వస్తున్నానని తెలిసి రాత్రికి కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో రైతులతో పవన్ సమావేశం కానున్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకాల వరి సాగు జరిగిందన్నారు. దిగుబడి 14 లక్షల టన్నులు కాగా ప్రభుత్వం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. కష్టపడి వ్యవసాయం చేస్తే తమకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉందని ఆవేదనలో రైతులు ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ధాన్యం ముందే కొనుగోలు చేసి ఉంటే తాము నష్టపోయి ఉండేవాళ్లం కాదనేది రైతుల ఆవేదనగా వివరించారు. ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదా అని పవన్ ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రైతుల సమస్యలను విన్న పవన్ తమ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కు పది పంటలు చూపిస్తే అందులో అయిదు పంటలను గుర్తించలేరని ఎద్దేవా చేసారు. పంటలు ఎలా పండిస్తారో ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ ను చూసి ధాన్యం కొనుగోలు చేయలేదని, వ్యవసాయం గురించి తమకు పూర్తిగా తెలుసని మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారని మంత్రి కాకాని వివరించారు.












Click it and Unblock the Notifications