pawan kalan bike riding: పవన్ కల్యాణ్ బైక్ రైడింగ్.. దాని ఖరీదు?
pawan kalan bike riding: ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏం చేసినా ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఒకవైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి సమయం మొత్తం రాజకీయాలకే కేటాయించాలని పవన్ భావిస్తున్నారు.
ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగొచ్చంటూ వైసీపీ సిగ్నల్స్ ఇస్తోంది. రాజకీయ వ్యవహారాలు వల్ల ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. వాస్తవానికి ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. యాత్ర ప్రారంభమయ్యేలోగా సాధ్యమైనంతవరకు ఈ సినిమాను పూర్తిచేయాలనే పట్టుదలతో జనసేనాని ఉన్నారు.

పవన్ కళ్యాణ్ 'BMW R1250 GS' మోడల్ బైక్ వేసుకొని 'రామోజీ ఫిల్మ్ సిటీ' లో తిరుగుతున్న వీడియో, ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ''వేగం నడిపే ఇంజన్ లో ఉండదు మిత్రమా.. నడిపేవాడి నరాల్లో ఉంటుంది'' అనే 'గోపాల గోపాల' సినిమాలోని డైలాగ్ ను పవన్ కల్యాణ్ అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ బైక్ ఖరీదు రూ.24 లక్షలుగా ఉంటుందని తెలియడంతో అందరూ షాకవుతున్నారు.
సినిమా షూటింగ్ లో భాగంగా తెప్పించారా? లేదంటే పవన్ కల్యాణ్ ఆ బైక్ కోసం అన్ని లక్షలు ఖర్చుచేశారా? అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. హరిహర వీరమల్లును రికార్డుస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది మార్చిలోకానీ, వేసవిలోకానీ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఎం రత్నం క్రిష్ దర్శకత్వంలో దీన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications