మెటాలో ఉద్యోగులకు షాక్ .. భారీ లే ఆఫ్ లు, అనూహ్య మార్పులు!
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద ఆధారపడుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో, టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. అనేక టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నాయి. తాజాగా మెటా తన ఉద్యోగులకు షాక్ ఇస్తుంది.
10 శాతం ఉద్యోగులను తొలగించనున్న మెటా
మెటా (Meta) తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించి, 7,000 మందిని ఏఐ ప్రాజెక్టులకు బదిలీ చేయనుంది. మే 20 నుండి ఈ లేఆఫ్‌లు ప్రారంభమవుతాయని మెటా హెచ్‌ఆర్ చీఫ్ జానెల్లె గేల్ ఒక అంతర్గత మెమోలో తెలిపారు. గేల్ తన మెమోలో ఉద్యోగుల తొలగింపుపై పేర్కొన్నారు.

ఉద్యోగులకు షాకింగ్ మెమో
''ఏఐ విధివిధానాలకు అనుగుణంగా చాలా సంస్థలు పునర్‌వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాయి. మనం కూడా ఆ మార్పులను అమలుచేయాల్సిన దశలో ఉన్నాం. ఇందులోభాగంగానే 10శాతం ఉద్యోగులకు లేఆఫ్‌లు విధించాలని నిర్ణయించాం. మేనేజర్ స్థాయి విధుల్లో ఉన్నవారిని పూర్తిగా పక్కనబెడతాం.'' అంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు.
ఏఐ సంబంధిత కొత్త ప్రాజెక్టుల్లోకి ఏడు వేల మంది
దాదాపు 7వేల మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత కొత్త ప్రాజెక్టుల్లోకి మార్చనున్నాం. ఇప్పటికే కొంతమంది ట్రాన్స్‌ఫర్లు పూర్తయ్యాయి. మిగిలిన వారికి మే 20 నుంచి అప్‌డేట్లు వస్తాయి. ఇక, ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా 6వేల కొత్త రోల్స్‌ను తీసుకురానున్నాం.అని తెలిపారు.
ఉద్యోగాల తొలగింపులో 8వేల మంది అవుట్
మార్చి నాటికి, మెటా 78,000 మంది ఉద్యోగులతో ఉండగా, దాదాపు 10 శాతం మంది ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. ఈ తొలగింపుల వల్ల సుమారు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇక ఏఐకి బదిలీలు కలిపి 20 శాతం సిబ్బంది ప్రభావితమవుతారు. 2022-23లో సుమారు 21,000 మందిని తొలగించిన తర్వాత ఇది అతిపెద్ద లే ఆఫ్ గా చెప్పొచ్చు . ఏఐ కోసం 600 బిలియన్ల డాలర్ల పెట్టుబడిలో భాగంగానే ఈ వ్యయ నియంత్రణ చేపట్టింది.
ఏడాది చివర్లోనూ తొలగింపుల ప్రణాళిక
మెటా ఈ ఏడాది చివర్లోనూ మరిన్ని తొలగింపులకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనితో పాటు, బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ ఛార్టెర్డ్ పీఎల్‌సీ బ్యాంక్ కూడా 2030 నాటికి 15 శాతం దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఏఐ ఏజెంట్లను వినియోగించనున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications