మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు, జగన్ ను అలాగే పిలుస్తా: పవన్..!!
జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో వాలంటీర్ల పైన సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని చెప్పపుకొచ్చారు. సీఎం పదవికి జగన్ అర్హుడు కాదని.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరైనదని కాదని ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి అవసరం లేదని పేర్కొన్నారు.
వాలంటీర్లపై సంచనల ఆరోపణలు: ఏపీలో ప్రజలకు సేవల్లో కీలకంగా మారిన వాలంటీర్ల పైన పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసారు. వైసీపీ పాలనలో ప్రతీ గ్రామంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి..కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. అందులో మహిళలకు ఎందరు..వితంతువులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ప్రభుత్వం చేసిన ఖర్చుల పై కాగ్ నివేదికలతో అక్రమాలు బయటపడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో చేసే ఖర్చులు ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం దోపిడీకి తెర తీస్తోందని పవన్ పేర్కొన్నారు. కాగ్ 25 లోపాలను ఎత్తి చూపిందని వివరించారు.
ముఖ్యమంత్రి లక్ష్యంగా: ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదని.. వైసీపీ నాయకులు నా కుటుంబం గురించి, బిడ్డల గురించి చెడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని , అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని వ్యాఖ్యానించారు. అతడి పార్టీ వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని అన్నారు. 2024లో జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు.

కమిషన్లు తీసుకోలేదు: తాను హైదరాబాద్ లో ఉంటానని సీఎం పదే పదే అంటున్నారని పవన్ చెప్పుకొచ్చారు. తాను అడ్డగోలుగా సంపాదించటం లేదన్నారు. సీఎం తండ్రిలా తన తండ్రి సీఎం కాదన్నారు. ఆయనలా ప్రతీ పనికి ఆరు శఆతం కమిషన్లు తీసుకొనే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తన తండ్రి ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా చెప్పారు.
తాను సినిమాలు తీసి వచ్చిన డబ్బుల్లో కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతున్నానని వివరించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నానని..ఎప్పుడైనా ప్రజల వద్దకు వచ్చావా అంటూ ప్రశ్నించారు. ఏడాదికి మద్యం ద్వారా రూ 1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని..అందులో రూ 97 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజనాకు చేరుతుందని పవన్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications