అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరేంద్రమోడీ ఎత్తుకు పవన్ కల్యాణ్ పై ఎత్తు?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకొని, తాను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నవేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన భేటీ వ్యూహాత్మక మలుపులకు కారణమవుతోంది. దీంతో పవన్ కల్యాణ్ కూడా తన రాజకీయం తాను చేస్తూనే, తన లక్ష్యాన్ని చేరుకునేలా అడుగులు వేస్తున్నారు. ప్రధానమంత్రిగా మోడీ మాటకు గౌరవమిస్తూ, రాజకీయ నేతగా చంద్రబాబుతో నెయ్యం జరుపుతున్నారు. ఈ పరిణామాలను గమనించి పరిశీలకులు పవన్ కల్యాణ్ కు రాజకీయం బాగానే వంటబట్టిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

 ప్రధానికి గౌరవమిచ్చి ఆ విషయాన్ని వెల్లడి చేయం

ప్రధానికి గౌరవమిచ్చి ఆ విషయాన్ని వెల్లడి చేయం


వాస్తవానికి నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ మధ్య ఏం జరిగిందనేది? ఏం చర్చించారనేది వారిద్దరికే తెలియాలి. తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు తెలియాలి. అంతకుమించి ఎవరికీ తెలిసేది లేదు. కానీ టీడీపీతో పొత్తు వద్దని, తొందరపాటు పనికిరాదని, చివరి క్షణం వరకు ఓపికగా ఎదురుచూడమని చెప్పారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ముఖ కవళికలు కూడా నిరాశగా ఉన్నాయని, ప్రధానమంత్రి చెప్పినది నచ్చకపోయినప్పటికీ ఆయన పదవికి గౌరవమిచ్చి ఎవరితోను ఈ విషయాన్ని పంచుకోమని మనోహర్ వెల్లడించారు.

 టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్లడమే మేలు?

టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్లడమే మేలు?


ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తన గెలుపుకూడా ముఖ్యం కావాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడమే సరైన చర్య అని మనోహర్ సలహా ఇచ్చినట్లు మరోవైపు నుంచి వార్తలు వచ్చాయి. భారతీయ జనతాపార్టీకి ఏపీలో కనీసం ఒకశాతం ఓటుబ్యాంకు కూడా లేదని, రాబోయే ఎన్నికలకు జనసేనదే 12 శాతం ఓటుబ్యాంకు ఉంటుందని నాదెండ్ల లెక్కలు వేసి చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ప్రధానమంత్రి చెప్పినట్లుగానే టీడీపీకి దూరంగా ఉండి జనసేన-బీజేపీ కూటమిగానే ఉండాలనుకుంటే వేరే వ్యూహాన్ని అమలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 బలమైనచోటే ప్రచారం చేస్తే..

బలమైనచోటే ప్రచారం చేస్తే..


రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులు పోటీకి దిగినప్పటికీ తనకు బలమైనవి, ఓట్లు ఎక్కువగా రాగలిగే నియోజకవర్గాల్లోనే ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతమేరకు సాధ్యపడుతుందనేది చూడాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్లడమే మేలని కొందరు నేతలు జనసేనానికి చెబుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
What actually happened between Narendra Modi and Pawan Kalyan?Both of them should know what was discussed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X