పవన్ కళ్యాణ్ దూకుడు: జెఎఫ్‌సి లోగో విడుదల, ప్రత్యేక హోదానే అస్త్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర నుండి రావాల్సిన నిధుల విషయంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటుకు సంబంధించిన లోగోను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు విడుదల చేశారు. ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయించిన నిధుల వివరాలను ఈ కమిటీకి ఇవ్వాలని టిడిపి, బిజెపి నేతలను పవన్ కళ్యాణ్ కోరారు.

పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎంపీలు ఆందోళన నిర్వహించారు. టిడిపి కూడ బిజెపి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

వర్మకు అదే ధ్యాస, సహకరించాలి: శివప్రసాద్, బహిరంగ చర్చకు సిద్దమేనా?:బిజెపి

బిజెపి, టిడిపి నేతలు ఏపీకి నిధుల కేటాయింపు విషయమై ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్నారు. ఈ తరుణంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

'మా సహనాన్ని పరీక్షించొద్దు', 'పార్టిని బతికించుకొనేందుకే బిజెపి మాటలు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దూకుడు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దూకుడు

ఏపీ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చోటు చేసుకొందని పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఈ తరుణంలో అసలు ఎవరు వాస్తవాలు చెబుతున్నారు, ఎవరు వాస్తవాలు చెప్పడం లేదనే విషయాలపై నిర్ధారణ చేసేందుకు జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీని ఏర్పాటు చేశాడు పవన్ కళ్యాణ్, అయితే ఈ కమిటీకి చెందిన లోగోను పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ట్విట్టర్‌లో షేర్ చేశారు.

 ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనను సూచిస్తూ లోగో

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనను సూచిస్తూ లోగో

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనను సూచిస్తూ లోగోను తయారు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జెఎఫ్‌సి అనే ఇంగ్లీష్ అక్షరాలను ఉంచారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ కమిటీ ప్రయత్నం చేస్తోంది. ఈ కమిటీ లెక్కలను తేల్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 ప్రత్యేక హోదా విషయమై ఆందోళన

ప్రత్యేక హోదా విషయమై ఆందోళన

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందనే డిమాండ్‌తో పవన్ కళ్యాణ్ ఆంధోళనకు శ్రీకారం చుట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ గతంలో ఆందోళనలు నిర్వహించారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వపన్ కళ్యాణ్ పోరాటం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే జెఎప్‌సి నివేదిక తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.

 పార్టీలకు ఓట్లు కురిపించే ప్రత్యేక హోదా

పార్టీలకు ఓట్లు కురిపించే ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అంశం రానున్న రోజుల్లో రాజకీయపార్టీలకు ఓట్లను కురిపించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్లే ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని ఏపీకి చెందిన రాజకీయపార్టీల నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదా విషయం మరోసారి అన్ని పార్టీలు తెరమీదికి తీసుకురానున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan Kalyan released JFC logo on Monday. Pawan Kalyan shared a logo on twitter.JFC working on funds allocations to Andhdrapradesh state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి