Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి కదలదు ; జనసేన నిద్రపోదు అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ? జనసేనాని మౌనంపై హాట్ డిబేట్ !!

రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ? అమరావతి కదలదు జనసేన నిద్రపోదు అని రాజధాని అమరావతి పోరాటంలో చివరివరకూ రైతుల పక్షాన నిలిచి అమరావతినే శాశ్వత రాజధానిగా మారుస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ తగ్గిందా? జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేలవమైన ప్రదర్శన కనబరుస్తుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

అమరావతి ఉద్యమంపై సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్

అమరావతి ఉద్యమంపై సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం అని, రాజధాని అమరావతిని ఎవరూ మార్చలేరని గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి పోరాటానికి బాసటగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అన్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంది కూడా రాజధాని అమరావతి సాధన కోసమేనని గతంలో చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి సాధన కోసం సాగుతున్న ఉద్యమంపై సైలెంట్ అయ్యారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. జనసేనాని సైలెంట్ వెనుక మర్మమేమిటి ? తమ పోరాటానికి పవన్ కళ్యాణ్ కి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? అని అమరావతి ఐక్యకార్యాచరణ సమితితో పాటు రాజధాని రైతుల్లో చర్చ జరుగుతుంది.

 అమరావతి కేంద్రంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నా స్పందించని పవన్

అమరావతి కేంద్రంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నా స్పందించని పవన్

నిన్న రాజధాని అమరావతి ఉద్యమం 600రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో కొనసాగిన ఉద్రిక్తత నేపధ్యంలో కూడా ఆయన స్పందించకపోవటంపై ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజధాని ప్రాంత రైతుల కోసం అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ వారి కోసం పోరాటం సాగిస్తానని చెప్పారు. వారితో సమావేశం నిర్వహించి మరీ వారి సమస్యలను తెలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇప్పుడు అమరావతిలో నిర్బంధ కాండ కొనసాగినా పవన్ స్పందించకపోవటం హాట్ టాపిక్ అయింది.

కేంద్రంతో చర్చల తర్వాత వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్

కేంద్రంతో చర్చల తర్వాత వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని, కేంద్రాన్ని ఈ వ్యవహారంలో అమరావతిని రాజధానిగా కొనసాగించేలా కేంద్రంతో మాట్లాడి వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి కోసం ఢిల్లీ వేదికగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి సాధనకు రైతుల పక్షాన నిలిచి చివరి వరకు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తారని భావిస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటున్నారు. ఇక ఆ చర్చల అనంతరం నుండి సైలెంట్ అయ్యారు. ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ అమరావతి పై తాను సాగిస్తానన్న పోరాటాన్ని కొనసాగించటం లేదనేది టాక్.

రాజధానిగా అమరావతి కోసం రైతులకు మాటిచ్చిన పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పిందిదే

రాజధానిగా అమరావతి కోసం రైతులకు మాటిచ్చిన పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పిందిదే

రాజధాని అమరావతినే శాశ్వత రాజధాని అని అప్పట్లో బల్ల గుద్ది మరీ చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత ప్రజలకు జనసేన పక్షాన భరోసా ఇచ్చారు . రాజధానిప్రాంత రైతులతో భేటీ అయ్యి బీజేపీతో కలిసింది కేవలం అమరావతి శాశ్వత రాజధాని కోసం అని ఆయన స్పష్టం చేశారు. మనసులో ఉన్న బాధను తొక్కిపెట్టి మరీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు బాసటగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంత ప్రజల ఒంటి మీద పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి కారణం అవుతుందని పవన్ కళ్యాణ్ నాడు పేర్కొన్నారు. ఆడపడుచులతో కన్నీరు పెట్టించిన జగన్ ప్రభుత్వం నాశనం అవుతుందని శాపనార్ధాలు కూడా పెట్టారు.

ఢిల్లీ పెద్దలతో మాట్లాడాక మారిన పవన్ స్వరం

ఢిల్లీ పెద్దలతో మాట్లాడాక మారిన పవన్ స్వరం

ఢిల్లీ వెళ్లి ఢిల్లీ బీజేపీ పెద్దలతో రాజధాని అమరావతి గురించి మాట్లాడి వస్తానని పేర్కొన్న ఆయన ఢిల్లీ పెద్దలతో రాజధాని అమరావతి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాజధానితో కేంద్ర పెద్దలకు సంబంధం లేదని, రాష్ట్రం నిర్ణయం తీసుకుంటే చేస్తారే తప్ప కేంద్రం సమ్మతి, అసమ్మతితో సంబంధం లేదని ప్రకటన చేశారు. ఇక అప్పటి నుండి సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ ఉద్యమం ఊసే ఎత్తటం లేదు. అమరావతి ఇక్కడ నుండి కదలదు.. జనసేన నిద్రపోదు అని రాజధాని ప్రాంత రైతులకు మాటిచ్చిన ఆయన ఇచ్చిన మాట తప్పారని ఇప్పుడు మొద్దు నిద్ర పోతున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

రాజధాని ప్రజల కన్నీళ్లు తుడుస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్న రైతులు

రాజధాని ప్రజల కన్నీళ్లు తుడుస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్న రైతులు

రాజధాని ప్రాంత ప్రజల కన్నీరు ఆనంద భాష్పాలు అయ్యేంతవరకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తుడవకుండా పవన్ ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నిస్తున్నారు. జనసేన, బీజేపీలు అమరావతి రాజధానిగా ఉండటం కోసం పోరాటం చేస్తామని మాటిస్తున్నా అని పేర్కొన్న ఆయన మాట తప్పారని వారంటున్నారు. అమరావతి కోసమే బీజేపీతో కలిసి సాగేది అని చెప్పిన జనసేనాని అమరావతి వ్యవహారాన్ని ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మీ త్యాగాలను తాను మర్చిపోలేనని చెప్పిన పవన్ మీ బిడ్డల భవిష్యత్ కోసం అండగా ఉంటానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు.

పవన్ మౌనంపై రాష్ట్రంలో చర్చ .. రాజకీయాలపై పవన్ ఫోకస్ పెట్టటంలేదని టాక్

పవన్ మౌనంపై రాష్ట్రంలో చర్చ .. రాజకీయాలపై పవన్ ఫోకస్ పెట్టటంలేదని టాక్

మీ కన్నీళ్లకు సమాధానం కోసం పోరాటం చేస్తానన్నారని తమ కన్నీళ్లను చూస్తూ మౌనంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి కావాలంటే మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు పెట్టుకున్నా తిరిగి ఒకే రాజధాని చేసి తీరతామని చెప్పిన పవన్ కళ్యాన్ ఇప్పుడు రాజధాని అమరావతిపై మౌనంగా ఉండటం కేంద్రం ఆదేశాలతోనే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవకాశవాద రాజకీయం తమకు రావని, మార్పు కోసమే పోరాటం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం పోరాటం చేస్తున్నారో చెప్పాలని అడుగుతున్నారు. రాజధాని అమరావతి ఆందోళనలు కొనసాగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై జనసేన పోరాటంలో వరుసగా ఫెయిల్ అవుతున్నారన్న చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టటం లేదన్న చర్చ జోరుగా సాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+