వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pawan Kalyan : చాతుర్మాస్య దీక్ష ప్రారంభం- 4 నెలలపాటు-కఠిన నియమాలతో-ప్రత్యేకతలివే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఓవైపు రాజకీయాల్ని, మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ నాలుగు నెలల పాటు ఓ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ దీక్ష కూడా కఠిన నియమాలతో కూడినదే. హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. ఏపీలోనూ వరుసగా టూర్లు నిర్వహిస్తూ కాక రేపుతున్నారు.వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టే పనిలో మరింత బిజీ అవుతున్న తరుణంలో పవన్ చేపట్టిన దీక్ష చర్చనీయాంశమైంది.

పవన్ బిజీ కళ్యాణ్

పవన్ బిజీ కళ్యాణ్

ఏపీలో జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేనంత బిజీగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఓవైపు ఇప్పటికే ఒప్పుకున్న షూటింగ్స్, మరోవైపు తరుముకొస్తున్న ముందస్తు ఎన్నికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు కాల్షీట్స్, షెడ్యూల్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్దితి. ఇందులో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా తనపై పడే ప్రభావం. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేసే ప్రతీ అడుగూ జాగ్రత్తగా చూసుకోవాలస్సిన పరిస్ధితి. దీంతో పవన్ ఈ బిజీ టైమ్ లో వేసే అడుగులపై ఆసక్తి నెలకొంటోంది.

పవన్ చాతుర్మాస్య దీక్ష

పవన్ చాతుర్మాస్య దీక్ష

ఇంత బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్న పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ రంగంతో పాటు ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని కూడా తన షెడ్యూల్ లో చేర్చుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ ఇప్పుడు చాతుర్మాస్య దీక్షచేపట్టారు. ఇవాళ్టి నుంచి నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. దీంతో తన బిజీ షెడ్యూల్స్ లోనే ఈ దీక్షను కూడా చేర్చుకున్నట్లయింది. ఈ దీక్షలో ఉంటూ పవన్ ఏం చేయబోతున్నారు, షూటింగ్స్, రాజకీయాలు ఎలా నడపబోతున్నారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.

చాతుర్మాస్య దీక్షలో పవన్

చాతుర్మాస్య దీక్షలో పవన్


ఇవాళ చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. మొత్తంగా నాలుగు నెలల పాటు అందులో ఉండబోతున్నారు.
ఆషాఢం,శ్రావణం, భాద్రపదం,ఆశ్వీయుజ మాసాల్లో ఈ దీక్ష కొనసాగనుంది. దీక్షలో ఉండే నాలుగు నెలల్లో రోజుకు ఒక్కపూట మాత్రమే ఆయన భోజనం చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.రాత్రి శాకాహారం భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగిస్తారు. ఇందులో కూడా కఠిన నియమాలతో పవన్ గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా కఠిన నియమాలతో దీక్ష చేస్తే ఆశయసిద్ధి అవుతుందని భావిస్తున్నారు.

English summary
pawan kalyan has began his four months long chaturmasya deeksha today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X