తొక్కే కొద్దీ పైకి లేస్తాం-సీఎం అనే పదాలు వద్దు : :శ్రమదానం- వర్షంలో తడుస్తూ నిరసన : పవన్ ఫైర్..!!
ప్రజాస్వామ్యంలో పనులు జరగనప్పుడు..ప్రభుత్వంకు చూపించటం మన హక్కు అని పవన్ చెప్పారు. దీనిని ఏ ప్రభుత్వం అపలేదన్నారు. రాజ్యంగం కల్పించిన హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదు. పోలీసుల పైన ఒత్తిడి పెట్టి పైకి లేస్తామన్నారు. పోలీసులు ఎన్ని అడ్డు పెట్టినా అర్దం చేసుకోగలనని..అది ప్రభుత్వ తప్పు అని వ్యాఖ్యానించారు. సీఎం అనే పదాలు వద్దు..అలిసి పోయాను..సీఎం అవ్వాలని మనసులో దాచకోండి..అయ్యే వరకూ అనకండి అంటూ అభిమానులకు సూచించారు. పచ్చి బూతులు తిడితే భయపడతానా..పవన్ గా నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో తనకే తెలుసని చెప్పుకొచ్చారు.

వర్షంలోనే జనసేనాని శ్రమదానం
ముందుగా చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో వర్షంలోనే హుకుంపేట-బాలాజీ రోడ్డులో శ్రమదానం చేసారు. వర్షం నీరు ఉన్న ప్రాంతంలో వాటిని తప్పించి అక్కడ మట్టి- సిమెంట్ వేసి రోడ్డుకు మరమ్మత్తు పనులు చేసారు. తొలుత ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శ్రమదానం చేయాలని భావించినా..అక్కడ సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పటంతో వేదిక మార్చుకున్నారు. దీంతో..రైల్వే స్టేషన్ సమీపంలోని హుకుంపేట-బాలాజీ రోడ్డులో శ్రమదానం చేసి ఆ తరువాత బాలాజీ సెంటర్ లో సభకు హాజరయ్యారు.
పోలీసులపై పవన్ ఫైర్ -వర్షంలోనే నిరసన
అయితే, ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో పవన్ తో పాటుగా మరో వాహనం మాత్రమే పోలీసులు అనుమతించి..మిగిలినవి అడ్డుకున్నారు. దీంతో..క్వారీ సెంటర్ లో పవన్ పోలీసుల మీద ఫైర్ అయ్యారు. వారిని వదలకుంటే తాను అక్కడే కూర్చుంటానని హెచ్చరించారు. ఎలా అడ్డుకుంటారంటూ ప్రశ్నించారు. దీంతో..పోలీసులు వారిని వదిలేసారు. ఇక, విమానాశ్రయం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన అనుచరులతో పవన్ సభా వేదిక వద్దకు చేరుకొనే సమయంలో మరోసారి బొమ్మూరు సెంటర్ లో పోలీసులు పవన్ వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. దీంతో..అక్కడే ఆగిపోయిన పవన్ కళ్యాణ్ జనసైనికులను పంపే వరకు కదలనని కారు టాప్ పైన గొడుగు వేసుకుని కూర్చున్నారు. ఆ తరువాత గొడుగు కూడా తీసేసి వర్షంలోనే తడుస్తూ వాహనాలను పంపాలని నిరసనకు దిగారు. ఆ తరువాత పోలీసులు వాటిని పంపటంతో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

జనసైనికుల్లో జోష్...
పవన్ కల్యాణ్ ప్రభుత్వం పైన తాను చేస్తున్న విమర్శలకు కొనసాగింపుగా ఆ టెంపో కంటిన్యూ చేస్తున్నారు. రాజమండ్రి సభకు ప్రభుత్వం అడ్డంకులు క్రియేట్ చేస్తుందనే ప్రచారంతో జనసేన నేతలు మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసైనికులు రాజమండ్రికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి సభ జరిగే ప్రాంత వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. తన అభిమానులను పోలీసులు అడ్డుకున్న సమయంలో పవన్ రియాక్ట్ అయిన తీరుతో కార్యకర్తల్లో ఉత్సహం కనిపించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు - కార్యకర్తలు తరలి రావటం... గతం కంటే భిన్నంగా పవన్ వ్యవహరించటంతో జనసైనికుల్లో కొత్త జోష్ మొదలైనట్లుగా కనిపిస్తోంది.

తిట్టిన వారిని దిలేదు.. వారిని నార తీస్తా...
సజ్జల మీరు పెద్దలు. మీకు నా గురించి బాగా తెలుసు. మీరు యాక్షన్ -కెమేరా -కట్ అని అన్నారు. మీలాంటి వాళ్లు ఉండి కూడా కనీసం 26 కీలీ మీటర్లు కూడా గుంతలు లేకుండా చేయగలరా. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లు లేరు. డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం ఈ కార్యక్రమం నిర్వహించలేదు. నేను వెళ్లి సలా చేస్తే ఏ పార్టీ అయినా గుండెళ్లో పెట్టుకొని చూసుకుంటుంది. నన్ను బూతులు తిట్టే వాటిని నార వలిచి చూపిస్తాను. నా మీద మానసిక అత్యాచారాలు ఎన్నో.. తొక్క తీసి నార తీస్తా. నా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు. తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి అంటూ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications