మెగా ఫ్యాన్స్ పోటీకి ఛాన్స్ దక్కేనా..!! పార్టీ కమిటీల్లో స్థానం : పవన్ ను సీఎం చేయాలంటూ..!!

ఇప్పటికే జనసేన కోసం పని చేస్తామని మెగా ఫ్యాన్స్ ప్రకటించారు. అయితే, వారిని పార్టీతో ఎలా సమన్వయం చేసుకోవాలి.. వచ్చే ఎన్నికల్లో పార్టీలో మెగా ఫ్యాన్స్ కు గుర్తింపు ఏ విధంగా ఇవ్వాలనే దాని పై జనసేన ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులు కృషి చేయాలంటూ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. చిరంజీవి యువత ప్రతినిధులతో మనోహర్ సమావేశమయ్యారు.

జనసేన జెండా మోసేందుకు...

జనసేన జెండా మోసేందుకు...


వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు.రాజకీయంగా జనసేన పార్టీ లాంటి ఒక క్లీన్‌ ప్లాట్‌ ఫామ్‌ ఉందన్నారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారాలని సూచించారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగమై మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకూ పార్టీని తీసుకువెళ్లాలన్నారు.

కమిటీల్లో ఫ్యాన్స్ కు ప్రాధాన్యత

కమిటీల్లో ఫ్యాన్స్ కు ప్రాధాన్యత

మండల, గ్రామ స్థాయి కమిటీల్లో ప్రాధాన్యం ఉండేలా చూస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. దీని ద్వారా మెగా ఫ్యాన్స్ కు అవకాశం ఉన్నంత మేర పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచన సైతం పార్టీలో మొదలైందనే చర్చ సాగుతోంది. దీని పైన పార్టీ నేతలు అధికారికంగా చెప్పకపోయినా.. అభిమాన సంఘాల నేతలు బలంగా ఉన్న ప్రాంతాల్లో టిక్కెట్ల ఖరారు పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మండల- గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత అభిమాన సంఘాలకు ప్రాధాన్యత ఉండేలా చూస్తామని మనోహర్ చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇస్తారా

ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇస్తారా

పార్టీ క్రియాశీలక సభ్యులకు త్వరలో కిట్లు పంపిణీ చేస్తామని, అలాగే వచ్చే నెల నుంచి శిక్షణా తరగతులు ఉంటాయని వెల్లడించారు. ఇందులో అభిమాన సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు. క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలను పార్టీలో కలిపే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి అవుతాయని చెప్పారు. జనసేన పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నామని చిరంజవి యువత నేతలు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పొత్తుల అంశం పైన కీలక వ్యాఖ్యల తరువాత ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. దీని పైన అనేక రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, టీడీపీ నుంచి దీని పైన ఇంకా స్పందన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+