కెలికిన జనసేన ! వైసీపీ వర్సెస్ టీడీపీ వార్! రంగంలోకి సీఎంవో..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా గత వైసీపీ సర్కార్ నాటి అక్రమాలు ఇంకా కొనసాగుతుండటంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టు వైసీపీ-టీడీపీ మధ్య తాజా చిచ్చు పెట్టింది. దీనిపై రెండు పార్టీలు మాటల యుద్ధానికి దిగడంతో పాటు ఎక్స్ లో కౌంటర్లు, ఎన్ కౌంటర్లు కొనసాగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది.
ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుండి ఎదేచ్చగా దాడి జరుగుతుంది అని నాకు సమాచారం వచ్చింది.. అధికారులు తక్షణమే స్పందించాలి.. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా తెలియజేస్తున్నట్లు రెండు రోజుల క్రితం జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ లో పెట్టారు.

ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక… pic.twitter.com/7qUPCe3ewW
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) July 16, 2024
దీనిపై స్పందించిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్.. ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెప్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే… pic.twitter.com/27R1dNyr7e
— Gudivada Amarnath (@gudivadaamar) July 17, 2024
గుడివాడ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీది...ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మేము అధికారం చేపట్టి 35 రోజులే అయ్యింది. కానీ ఎర్ర మట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారో భీమిలి కో ఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటి కార్యదర్శి సూరిబాబు గారి మాటల్లోనే విని సిగ్గుపడండి..? అంటూ ఆయన వ్యాఖ్యల వీడియోను పోస్టు చేశారు.
కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీది...
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) July 18, 2024
ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదు..
మేము అధికారం చేపట్టి 35 రోజులే అయ్యింది. కానీ ఎర్ర మట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి.
ఎర్రమట్టి దిబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి… pic.twitter.com/57MEVa94cB
ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా గుడివాడ అమర్ ను టార్గెట్ చేస్తూ మరో పోస్టు పెట్టారు. దీంతో చివరికి సీఎంవో రంగంలోకి దిగింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. దీంతో ఈ తవ్వకాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తవ్వకాల కొనసాగింపు వెనుక ఎవరున్నానేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications