వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ముందస్తు'కు సిద్దమన్న జనసేన; గద్దర్‌కు సూటి ప్రశ్న, పవన్ ఏమన్నాడో గుర్తుందా?

వచ్చే ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీని గెలిపించే వ్యూహంలో జనసేన భాగమవడాన్ని కొట్టిపారేయలేం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటు కేసీఆర్ రైతులకు వరాల మీద వరాలు ఇస్తుండటం.. అటు చంద్రబాబు పార్టీ నేతలతో ఎన్నికలకు సిద్దంగా ఉండండి అంటూ సూచనలు ఇవ్వడం.. ముందస్తు ఎన్నికల సంకేతాలను తెరపైకి తీసుకొచ్చాయి.

పవన్ కళ్యాణ్-జగన్‌లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?పవన్ కళ్యాణ్-జగన్‌లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?

జనసేన సిద్దం:

ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఎలా ఉన్నా.. జనసేన మాత్రం అందుకు సిద్దమని ప్రకటించింది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ముందస్తు ఎన్నికలపై స్పందించారు. ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" అందుకు సిద్దమేనంటూ పవన్ పేర్కొన్నారు.

జనసేనపై బాబు ఆలోచన:

జనసేనపై బాబు ఆలోచన:

కాగా, 2019నాటికి ఏపీ రాజకీయ సరళి పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటం.. అంతదాకా వేచి చూస్తే జనసేన బలోపేతం అయ్యే అవకాశం ఉండటం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికల మాట లేవనెత్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

టీడీపీ గెలుపులో జనసేన పరోక్షంగా:

టీడీపీ గెలుపులో జనసేన పరోక్షంగా:

అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఎవరికి లాభిస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే మాత్రం అది కచ్చితంగా టీడీపీకే అనుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. పవన్ పోటీ ఓట్ల చీలికను తీసుకువస్తుంది కాబట్టి ప్రతిపక్షం వైసీపీని ఇది దెబ్బకొట్టవచ్చు.

పైగా పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అన్న దాఖలా కూడా లేదు. అదీగాక ఆయన లాంటి అనుభజ్ఞులు సీఎంగా ఉండటం అవసరమంటూ చాలాసార్లు వేదికలపైనే చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి చూస్తే.. పరోక్షంగా టీడీపీని గెలిపించే వ్యూహంలో జనసేన భాగమవడాన్ని కొట్టిపారేయలేం.

గద్దర్‌కు తెలంగాణ జనం ప్రశ్న?:

గద్దర్‌కు తెలంగాణ జనం ప్రశ్న?:

ఇక తెలంగాణ విషయానికొస్తే.. గద్దర్-పవన్ లు జతకట్టడం అన్న విషయం ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కు లేఖ రాసినట్లు గద్దర్ పేర్కొన్నారు.

అయితే గద్దర్ నయా రాజకీయాల పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించాక.. 10రోజులు అన్నమే తినలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ తో గద్దర్ జతకట్టడమేంటని సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం పట్ల పలుమార్లు బహిరంగంగానే తన వ్యతిరేకతను బయటపెట్టుకున్న పవన్ తో గద్దర్ రాజకీయం ఎంతవరకు పనిచేస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.

English summary
Janasena President Pawan Kalyan was recently announced that his party was ready to compete if early elections will be held
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X