డిప్యూటీ సీఎంగా లోకేష్ ఓకే, కానీ - జనసేన కీలక ప్రతిపాదన..!!

ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి పైన రచ్చ సాగుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి .. ఈ అంశం పైనే టీడీపీ వర్సస్ జనసేన కేడర్ సోషల్ మీడియా వార్ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ వివాదం పైన రెండు పార్టీల అధినాయకత్వం స్పందించలేదు. తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయటానికి అభ్యంతరం లేదని చెబుతూనే.. జనసేన కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది.

కూటమిలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ నేతలు కొత్త డిమాండ్ మొదలు పెట్టారు. హోం మంత్రి అనిత పైన వ్యాఖ్యలు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరు తో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందని టీడీపీ నేతల వాదన. దీంతో, పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాం డ్ చేస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ వచ్చినా.. ఆయన స్పందించలేదు. కాగా, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పైన వార్ కొనసాగుతోంది. ఇప్పుడు టీడీపీ నేతల ప్రతిపాదన పైన జనసేన కొత్త డిమాండ్ మొదలు పెట్టింది.

Janasena latest proposal amid TDP leaders demand for Lokesh to elevate as Dy CM

లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. తాము ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబు తో కలిపి నలుగురుగా భావించామని చెప్పుకొ చ్చారు. ఇక, మంత్రి లోకేశ్‌ ను డిప్యూటీ సీఎం పదవి లో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కల్యాణ్‌ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు.

తమ పార్టీ వారే కాకుండా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరు కుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అనవ సర వ్యాఖ్యలతో వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+