వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీ వ్యాపారుల తీరులో జగన్ పాలన.. ఉద్యోగుల్లో ఆశలు రేపి దగా చేస్తారా? : నాదెండ్ల మనోహర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుల్లో ఆశలు రేపి ఇప్పడు నిలువునా దగా చేసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైందన్నారు. ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం కాబట్టి వెనక్కి ఇవాలన్న తీరుతో జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల తీరులో వైసీపీ ప్ర‌భుత్వం

కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల తీరులో వైసీపీ ప్ర‌భుత్వం

కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల తీరులో వైసీపీ ప్ర‌భుత్వం
జీతాల పెంపుదలపై పదేపదే సంఘాలను చర్చలకు పిలిచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఏపీ సర్కార్ మభ్యపెట్టిందని నాదెండ్ల మనోహన్ విమర్శించారు. ఐ.ఆర్. కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇంటి అద్దె భత్యాలను తగ్గించిందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డి.ఏ.లను గతంలో ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వాటి రూపంలో వసూలు చేసుకొంటామని చెప్పడం చూస్తుంటే సీఎం జగన్ పాలన చేస్తున్నట్లుగా లేదని దుయ్యబట్టారు. కాల్ మనీ, వడ్డీ వ్యాపారులు తమ బకాయిలను వసూలు చేసుకొనే విధంగా కనిపిస్తోందని ఆరోపించారు

 వేద‌న‌లో పోలీసులు

వేద‌న‌లో పోలీసులు

రాష్ట్రంలో పోలీసులు తమ బాధలను పంటి బిగువున ఉంచుకొంటున్నారన్నారు మనోహర్. వారికి సక్రమంగా టి.ఏ.లు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో జీతభత్యాలు తగ్గించడంతో వారు మరింత వేదనకు లోనవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధన విధుల కంటే ఇతర విధులు పెంచి జీతాలు తగ్గించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు పాలన దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.

 స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌ ఎక్క‌డ దాక్కొన్నారు.?

స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌ ఎక్క‌డ దాక్కొన్నారు.?

తమ జీతాల పెంపుదల గురించి ఉద్యోగులు అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పి.ఆర్.సి.వల్ల జీతం పెరిగిందని చెప్పడం విచిత్రంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ముందుకు వస్తూ.. ముఖ్యమంత్రి తరపున చర్చలు చేసే ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఇప్పుడు ఎందుకు తప్పించుకొని దాక్కొన్నారని ప‌రోక్షంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఫోన్ ద్వారా కంట్రోల్ లో ఉండేలా చేసిన ఆ పెద్దమనిషి ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశారో ఉద్యోగులు నిలదీయాలన్నారు. ఆర్ధిక పరిస్థితి గురించి చర్చల సమయంలోనే ఎందుకు చెప్పలేదని మనోహర్ ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆదాయం బాగుందని కాగ్ పొగిడిందంటూ గొప్పలు చెప్పుకొన్న పాలకులు ఇప్పుడు మాత్రం పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారని చురకులు అంటించారు.

 రిటైర్డ్ ఉద్యోగులకు బాధ‌పెట్టేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

రిటైర్డ్ ఉద్యోగులకు బాధ‌పెట్టేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ తగ్గే విధంగా జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు . ఉద్యోగులో, పెన్షన్ అందుకొనేవారో, వారి జీవిత భాగస్వామో చనిపోతే.. అంత్యక్రియల నిమిత్తం ఇచ్చే మట్టి ఖర్చులను కూడా తొలగించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 2019లో వైసీపీ ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి మట్టి ఖర్చులను చెల్లించే విధానం ఆపేసిందని.. ఇప్పుడు వాటిని పూర్తిగా రద్దు చేశారని సీరియస్ అయ్యారు. అలాగే 70సం. పైబడినవారికి ఇచ్చే క్వాంటమ్ పెన్షన్ అర్హతను 80 సం.గా మార్చడం వృద్ధాప్యంలో ఉన్న వారిని బాధపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలపై ఇచ్చిన అర్ధరాత్రి జీవోలను తక్షణమే రద్దు చేయాలన్నారు. జీతాలపై పెంపుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు

English summary
Nadenla Manoha serious on ap govt over employees prc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X