వైఎస్ జగన్ కు జనసేన కౌంటర్.. 2016 వీడియో వైరల్

తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అవనిగడ్డ సభలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. దత్త పుత్రుడు, దత్త తండ్రి కలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్పడంద్వావరా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు.

మాట తప్పితే చీపుర్లే గతి!

తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కౌంటర్ ఇచ్చింది. 'మాట తప్పితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లే గతి.. నాకైనా ఇదే వర్తిస్తుంది'' అంటూ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యల్ని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 2016 జూన్ 14వ తేదీన విజయవాడలో వైసీపీ విస్త్రతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ 'రాజకీయ నాయకులు తమను మోసగిస్తే చెప్పులు, చీపుర్లు చూపిస్తామనే స్థాయికి ప్రజలు రావాలి.. ఇది రాజకీయ నాయకులందరికీ వర్తించాలి. అబద్ధాలు ఆడితే ఎవరికైనా సరే చెప్పులు, చీపుర్లు చూపించండి.. ఈ సవాల్‌ ఎందుకు చేస్తున్నానంటే రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది'అన్నారు.

మూడు పెళ్లిళ్ల చేసుకుంటే మంచిదని పవన్ ఎక్కడా అనలేదు!

మూడు పెళ్లిళ్ల చేసుకుంటే మంచిదని పవన్ ఎక్కడా అనలేదు!

హైదరాబాద్ లోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మంచిదని పవన్ ఎక్కడా వ్యాఖ్యానించలేదు.. జగన్ పవన్ అలా అన్నారు అంటూ అవనిగడ్డ సభలో చెప్పారు.. ఆయనకు వినికిడి శక్తి లోపించిందేమో.. మంచి ఈఎన్ టీ వైద్యుడికి చూపించాలి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇందుకు కావల్సిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలను పెట్టుకున్నవాళ్ల గురించి పవన్ మాట్లాడితే ముఖ్యమంత్రి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాసలీలలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్!

రాసలీలలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్!

రాసలీలలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆ పార్టీ నాయకులు తీరు అందరికీ తెలిసిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 గెలుచుకుంటున్నామంటున్నారని, దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజల తీర్పు కోరాలని సవాల్ విసిరారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జనవాణి ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. సమావేశంలో పార్టీ నేతలు అర్హంఖాన్, నేమూరి శంకర్ గౌడ్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+