జనసేన వర్సెస్ వైసీపీ, జీజీహెచ్‌లోనూ డిష్యూం డిష్యూం, ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద గొడవతో..
కాకినాడలోని జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తలు హల్ చల్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో జనసేన కార్యకర్తలకు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద గొడవ జరిగింది. గాయపడ్డ ఇరు పక్షాలకు చెందిన వారు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. అయితే అక్కడ కూడా వారు గొడవ పడ్డారు.
ఆదివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో జనసేన కార్యకర్తలు కూడా గాయపడ్డారు.

గాయపడ్డ ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైసీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనను మీడియా ప్రతినిధి మొబైల్లో చిత్రీకరిస్తుండగా ఆమెపై కూడా దాడిచేయడంతో సృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. రిపోర్టర్‌పై దాడిని అడ్డుకున్న నర్సులపై జనసేన కార్యకర్తలు దాడిచేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications