చరిత్ర సృష్టించిన జనసేన యూట్యూబ్ ఛానల్; పవన్ కళ్యాణ్ ట్వీట్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జనసేన ప్రారంభించిన జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ తాజాగా చరిత్రను సృష్టించింది. జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ను ఇష్టపడుతూ సబ్ స్క్రైబ్ చేసిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.
10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సాధించడంతో దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ జనసేన అధికారిక యూట్యూబ్ ఛానల్ ట్వీట్ చేసింది. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

10 లక్షల సబ్ స్క్రైబర్స్ ను చేరుకున్న జనసేన అధికారిగా యూట్యూబ్ ఛానల్ పోస్టర్ ని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ తెలియజేశారు. 10 లక్షల మంది వినియోగదారులను చేరుకోవడం సంతోషం అన్నారు. జనసేన కు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
My Heartfelt Congratulations to @JanaSenaParty for reaching the one million subscribers. Thank you all the supporters of JanaSena.🙏🏻 pic.twitter.com/EKojMcGO1X
— Pawan Kalyan (@PawanKalyan) June 26, 2023
ఇదిలాఉంటే ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారాహి విజయయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రలో భాగంగా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గద్దె దించాలని పిలుపునిస్తున్నారు. ఒక్క ఛాన్స్ జనసేన కు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ వారాహి విజయ యాత్రలోనూ పవన్ కళ్యాణ్ పై ప్రజల అభిమానం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఒక బధిరుడు పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకుని ఏడుస్తూ ఆయనపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఎంతోమంది పవన్ పట్ల అభిమానం చూపిస్తున్నారు. జనసేన పార్టీని ఆదరిస్తున్నారు.












Click it and Unblock the Notifications