వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మీద జనసేన కత్తి లాంటి ర్యాప్ సాంగ్..! దుమ్ము రేపిన గబ్బర్ సింగ్ విలస్లు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అందులో ఉండే కిక్కే వేరబ్బా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. సిమాలో ఫైటింగ్ చేసినా, కామెడీ పండించినా, డాన్స్ చేసినా ఆ ప్రత్యేకతే వేరబ్బా అని పొంగిపోతారు అభిమానులు. ఇక ప్రజా క్షేత్రంలో పబ్లిక్ సమావేశాలు నిర్వహించినా, పాదయాత్ర చేసినా, ఉపన్యాసం ఇచ్చినా దాని ప్రత్యేకత వేరబ్బా అంటుంటారు జనసేన కార్యకర్తలు.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలతో కాస్త ఇంటీమసీ తగ్గించుకున్నా దాన్ని తరిమికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇస్తున్న సలహాలు, సూచనలు మాత్రం ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారికి దూరంగా ఉంటూ ఎలా దానిపై విజయం సాదించాలో ఓ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేసారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

 Janesena Rap song on Corona.!Pawan Kalyan released the through twitter..!

దాదాపు 120 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ వినూత్న ప్రయోగం చేసింది. ప్రజలందరికి సులభంగా అర్ధం అయ్యేలా ఓ ర్యాప్ పాటను రూపొందించింది జనసేన. ఈ పాటుకు సంబందిచిన వివరాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఇంత అద్భుతంగా ఈ పాటను మలిచిన మ్యూజిక్ డైరెక్టర్ కోటికి, గీత రచయిత ప్రియాంకకు, ఇతర సహాయ బృందానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాక కరోనాపై ర్యాప్ సాంగ్ ద్వారా చైతన్యం తీసుకురావడమే కాకుండా, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్లాక్ బస్టర్ హిట్టయిన గబ్బర్ సింగ్ సినిమాలో వినూత్నంగా నటించిన విలన్ల చేత పాడించారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరాటంలో భాగంగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

Recommended Video

Mega Brother Nagababu Praises PM Modi & CM KCR

English summary
The Janasena Party has launched an innovative campaign to educate the public on the coronavirus that has swept over 120 countries.Janasena has created a rap song to make it easier for people to understand. Janasena chief Pawan Kalyan shared the details with the fans via Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X