తిరుమలలో పెళ్లి, ముగ్గురు పిల్లలు, లుంగీలో మావారు.. జాన్వీ కపూర్ కోరిక!
సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్ తో ఎదుగుతున్న జాన్వీ కపూర్ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అటు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా తనదైన దూకుడును సాగిస్తున్నారు జాన్వీ కపూర్ .
తిరుమల గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన జాన్వీ కపూర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరలో హీరోయిన్ గా చేసిన జాన్వి కపూర్ ప్రస్తుతం దేవర 2 లో నటిస్తున్నారు. ఇక రాంచరణ్ తో ఆర్సి 16 సినిమా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ షోలో జాహ్నవి కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వి కపూర్ ఏపీలోని తిరుమల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని కోరిక చెప్పిన జాన్వీ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన జాన్వి కపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని పేర్కొన్నారు తన భర్తతో ముగ్గురు పిల్లలతో తిరుమల లో హాయిగా గడపాలని ఉందని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తినాలని గోవిందా గోవిందా అంటూ స్మరించుకుంటూ జీవించాలని ఉందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.
లుంగీలో భర్త, గోవిందా గోవిందా స్మరణం
మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఉందని ఆమె తెలిపారు. ఇక తనను పెళ్లి చేసుకునే భర్త లుంగీలో ఉండాలని, చూడడానికి ఇది చాలా రొమాంటిక్ గా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. జాన్వి కపూర్ తరచూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఆమెకు వెంకటేశ్వర స్వామి పైన ఎనలేని భక్తి. సమయం కుదిరినప్పుడల్లా ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు.
తిరుమలపై జాన్వీ కపూర్ ప్రేమ
తిరుమల గిరులపై సేద దీరుతారు. అటువంటి జాన్వి కపూర్ కు తిరుపతిలో పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలని ఉందని చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది. జాన్వి కపూర్ ఆలోచనల పైన చర్చ చేసేలా చేస్తుంది. ఆమెకు తిరుమలపైన ఉన్న ప్రేమకు ఆమె వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications