వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కంచుకోటపై పవన్ కన్ను...జనసేనాని లెక్క ఇదే..అక్కడే అసలు ట్విస్ట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్ టార్గెట్ రాజకీయాలు పదునెక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలి అనే లక్ష్యంతో ప్రతిపక్షాలు అడుగులు వేసున్నాయి. ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. జనసేన నుంచి ఇప్పటి వరకు దీని పైన అధికారికంగా స్పందన రాలేదు. పార్టీ నేతలు మాత్రం కండీషన్లతో అంగీకారం తెలుపుతూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇక, 2019 ఎన్నికల్లో జనసేన అధినేత తన పాత్ర పైన ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఈ సారి తాను పోటీ చేసే స్థానాల పైన స్పష్టతతో అడుగులు వేస్తున్నారు.

పవన్ పోటీ చేసే స్థానాల్లో మార్పు

పవన్ పోటీ చేసే స్థానాల్లో మార్పు

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.. విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇప్పటికీ వైసీపీ నేతలు ఆ ఓటమి గురించి ప్రస్తావిస్తేనే ఉన్నారు. దీంతో..ఈ సారి టీడీపీతో పొత్తు ఉన్నా.. బీజేపీతోనే కొనసాగినా తాను ఎక్కడ పోటీ చేయాలనే దాని పైన పవన్ ఇప్పటికే క్లారిటీకి వచ్చేసారని పార్టీ ముఖ్యనేతల సమాచారం.

అందులో భాగంగా కాపు వర్గం మెజార్టీ ఓటర్లు...రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే జిల్లా అయిన తూర్పు గోదావరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదారి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కాకినాడ పైన పవన్ ఫోకస్ పెట్టారు. కాకినాడ అర్బన్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో పవన్ కళ్మాణ్ పైన వ్యాఖ్యలు చేసారు.

రెండు సీట్లపై ప్రధానంగా చర్చ

రెండు సీట్లపై ప్రధానంగా చర్చ

అదే విధంగా.. కాకినాడ రూరల్ పైన చర్చలు చేస్తున్నారు. అక్కడ నుంచి మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తొలుత ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు. తిరిగి 2019 లోనూ ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారదు.

గత కొంత కాలంగా పవన్ వర్సస్ కన్నబాబు పొలిటికల్ గా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితోనూ కన్నబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో రూరల్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తిరుపతి నుంచి సీమపై ఫోకస్

తిరుపతి నుంచి సీమపై ఫోకస్

తాను అక్కడి నుంచి పోటీ చేస్తే..ఈ సారి మారుతన్న సామాజిక సమీకరణాల్లో జిల్లా లో ఆ ప్రభావం ఉంటుందని..కాకినాడ ఎంపీ సీటు కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక, గతంలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయగా.. ఈ సారి రాయలసీమ నుంచి పోటీ చేసి వైసీపీకి బలమైన సంకేతాలు ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది.

సీమలో బలిజ వర్గం తిరుపతి బై పోల్ సమయంలో జనసేన అభ్యర్ధిని బరిలో దించాలని డిమాండ్ చేసింది. బీజేపీ నుంచి అభ్యర్ది పోటీ చేసారు. దీంతో..రాయలసీమలో ఆయన అనంతపురం నుంచి గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అయినా.. ఈ సారి పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

సామాజిక సమీకరణాలే లక్ష్యంగా

సామాజిక సమీకరణాలే లక్ష్యంగా

2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. అప్పుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ద్వారా అక్కడి సామాజిక సమీకరణాలు సఫలం అయితే, ఖచ్చితంగా వైసీపీకి నష్టం తప్పదనే విశ్లేషణ వినిపిస్తోంది. పొత్తుల పైన ఇంకా క్లారిటీ రాకున్నా.. పొత్తు మాత్రం ఖాయమనే అభిప్రాయం ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Tollywood పండగ చేసుకుంటోంది | Go 35 | Andhra Pradesh || Oneindia Telugu
జగన్ ను ఎదుర్కోవటమే టార్గెట్

జగన్ ను ఎదుర్కోవటమే టార్గెట్

దీంతో.. 2019 ఎన్నికల్లో జగన్ తన గెలుపు కోసం అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ నే ఈ సారి చంద్రబాబు నమ్ముకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సమావేశాలతో పొలిటికల్ గా పార్టీల పైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్న కాపు ఓటింగ్ పైన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దీంతో..ఈ సారి పవన్ - చంద్రబాబు - జగన్ ముగ్గురూ రాయలసీమ నుంచే పోటీ చేయటం ద్వారా అక్కడి బలా బలాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మొత్తంగా... ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
News is making rounds that Janasena Chief Pawan Kalyan has chosen to contest from Tirupati and Kakinada rural in the 2024 assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X