వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

January 27: సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడిన రోజు జనవరి 27.. అస్సలు ఈ రోజు ఏం జరిగింది..!

జనవరి 27న సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొన్నాయి. జమున, శ్రీనివాస మూర్తి మృతి, తారకరత్నకు గుండె పోటు సినీ పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసింది.

|
Google Oneindia TeluguNews

జనవరి 27 సినీ ఇండస్ట్రీకి బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. గురువారం తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదాలు నెలకొన్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా వివిధ పాత్రల్లో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ సినీ నటి జమున ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వెండి తెర సత్యభామగా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన జమున.. నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

కర్ణాటక

కర్ణాటక


పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తనకు ఇచ్చిన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి జమున.. తెలుగుసినిమా తల్లికి తన నటనతో ఎంతో సేవ చేశారు. జమున మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు నేలపై ఆమె ఎదిగి, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు . 1937 కర్ణాటకలోని జమున కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాకు వలస వచ్చారు.

తారక రత్న

తారక రత్న

జమున కన్నుమూసిన విషయం తెలుసుకునే లోపే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. ఆయన
గుండెపోటుతో చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. శ్రీనివాస మూర్తి ఎంతో మంది తమిళ హీరోలకు తెలుగులో గాత్రం అందించారు. సూర్య నటించిన సింగం సహా ఎన్నో సినిమాల్లో తన వాయిస్‌తో ఆయా సినిమాలకు ప్రాణం పోశాయి. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రకు శ్రీనివాస మూర్తి చెప్పిన డబ్బింగ్ ఎప్పటికీ గుర్తుంటుంది. శ్రీనివాస మూర్తి సూర్య, విక్రమ్ మాత్రమే కాకుండా జనతా గ్యారేజ్‌లో మోహన్‌‌లాల్‌కు, తెగింపు, వలీమై సహా అజిత్ కు డబ్బింగ్ చెప్పారు.

బాలకృష్ణ

ఈ రెండు దుర్ఘటనలు ప్రజలు బాధపడుతుండగానే మరో వార్త అందరిని ఆందోళనకు గురి చేసింది. స్వర్గీయ నందమూరి తారకరామరావు మనవడు, నందమూరి తారకరత్నకు గుండె పోటు వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.

45 నిమిషాలు

45 నిమిషాలు

అయితే తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించమన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. తారక రత్నకు గుండె నాళాల్లో ఎక్కవ బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు... యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్ లు తొలిగించారు. రేపటికి కానీ పరిస్థితి చెప్పలేమన్నారు. కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు.

నరేష్

నరేష్

ఇది ఇలా ఉంటే ప్రముఖ నటుడు నరేష్ న మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ చెప్పారు. రమ్య, రోహిత్ శెట్టితో తనకు ప్రాణహాని ఉందని నరేష్ కోర్టును ఆశ్రయించాడు. 2022 ఏప్రిల్ తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారని నరేష్ ఆరోపించారు.

English summary
January 27 can be said to be a black day for the film industry. Although there were tragedies in the Telugu film industry on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X