గురి తప్పని 'వాయు అస్త్ర'.. 100 కిలోమీటర్ల అవతల శత్రువు ఖేల్ ఖతం!

రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని చాటుతూ పుణెకు చెందిన నిబే లిమిటెడ్ (Nibe Limited) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారత సైనిక అవసరాలకు తగ్గట్టుగా అత్యంత అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థలను రూపొందిస్తూ, దేశ రక్షణ సామర్థ్యాన్ని మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'వాయు అస్త్ర' లోయ్టరింగ్ మ్యునిషన్ (ఆత్మహుతి డ్రోన్), ' సూర్యాస్త్ర' రాకెట్ లాంచర్ వ్యవస్థలు జరిపిన ప్రయోగాలు అద్భుత విజయాలను నమోదు చేశాయి.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు చెల్లింపులు, కొనుగోలు హామీ లేని (NCNC) పద్ధతిలో 'వాయు అస్త్ర-1' పరీక్షలను నిర్వహించారు. రాజస్థాన్‌లోని తారు ఎడారి (పోఖ్రాన్), ఉత్తరాఖండ్‌లోని మంచు పర్వతాలు (జోషిమఠ్) వేదికగా జరిగిన ఈ పరీక్షల్లో 'వాయు అస్త్ర' అమోఘమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇజ్రాయెలీ డిజైన్ ఆధారంగా రూపొందించిన ఈ ఆయుధం శత్రువుల స్థావరాలను క్షణాల్లో బూడిద చేయగలదు.

Make In India Defence Boost Nibe Ltd Tests Vayu Astra Suicide Drone And Suryastra Launcher At Pokhran

పోఖ్రాన్ ఎడారిలో అమోఘమైన గురి!

ఏప్రిల్ 18, 19 తేదీల్లో పోఖ్రాన్ రేంజ్‌లో జరిగిన యాంటీ-పర్సనల్ (వ్యక్తులపై దాడి చేసే) పరీక్షల్లో ఈ డ్రోన్ తన విశ్వరూపాన్ని చూపించింది.

  • ఖచ్చితమైన దాడి: 10 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్తూ, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కేవలం ఒక మీటర్ కన్నా తక్కువ తేడాతో (CEP) ఒకే ప్రయత్నంలో ఛేదించింది.
  • కమాండ్ బదిలీ: గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫార్వార్డ్ కంట్రోల్ సెగ్మెంట్‌కు దీని నియంత్రణను విజయవంతంగా బదిలీ చేశారు.
  • రాత్రి వేళల్లోనూ రౌద్రం: చీకట్లో కూడా శత్రువుల ట్యాంకులను ఇన్‌ఫ్రారెడ్ (IR) కెమెరా సాయంతో రెండు మీటర్ల కచ్చితత్వంతో ధ్వంసం చేసింది.
  • తిరిగి వచ్చే సామర్థ్యం: ఒకవేళ దాడిని మధ్యలోనే రద్దు చేస్తే, సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చి, మరోసారి దాడికి సిద్ధమయ్యే అద్భుత టెక్నాలజీని ఇది ప్రదర్శించింది.
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

జోషిమఠ్ కొండల్లో 'వాయు అస్త్ర' స్టామినా

పోఖ్రాన్ ఎడారిలోనే కాకుండా, ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ (మాలారీ) వద్ద ఉన్న మంచు పర్వతాల పైన కూడా ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ వ్యవస్థను పరీక్షించారు. సుమారు 14,000 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో, ఏకధాటిగా 90 నిమిషాలకు పైగా గాల్లో ఎగురుతూ తన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసింది. మిషన్ పూర్తయిన తర్వాత క్షేమంగా ల్యాండ్ అయి, తదుపరి విమానాలకు కూడా సిద్ధంగా ఉండే రికవరీ సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

ఒడిశా తీరంలో గర్జించిన 'సూర్యాస్త్ర'

కేవలం డ్రోన్ల రంగాగారంలోనే కాకుండా, రాకెట్ లాంచర్ వ్యవస్థల్లోనూ నిబే లిమిటెడ్ దూసుకుపోతోంది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటరీమ్ టెస్ట్ రేంజ్ (ITR)లో మే 18, 19 తేదీల్లో 'సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్' వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. నిర్దేశించుకున్న అన్ని రక్షణ లక్ష్యాలను ఈ లాంచర్ అత్యంత కచ్చితత్వంతో చేరుకుందని సంస్థ ప్రకటించింది.

కర్నూలులో DRDO విశ్వరూపం.. గాల్లోనూ, నేలపైనా వేటాడే ఏకైక వెపన్!
కర్నూలులో DRDO విశ్వరూపం.. గాల్లోనూ, నేలపైనా వేటాడే ఏకైక వెపన్!

భారత సైన్యంతో కీలక ఒప్పందం

జనవరి 2026లో భారత సైన్యం యొక్క అత్యవసర కొనుగోలు విండో (Emergency Procurement Window) కింద నిబే లిమిటెడ్‌కు ఒక ప్రతిష్టాత్మక ఆర్డర్ లభించింది. ఈ ఒప్పందంలో భాగంగానే 'సూర్యాస్త్ర' యూనివర్సల్ రాకెట్ లాంచర్‌తో పాటు, దానికి ప్రత్యేకంగా ఉపయోగించే 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల సుదూర పరిధి గల రాకెట్‌ల అభివృద్ధి, సరఫరా పనులు శరవేగంగా సాగుతున్నాయి.

సరిహద్దుల్లో సవాలు విసిరే శత్రువులకు బుద్ధి చెప్పేందుకు, "మేక్ ఇన్ ఇండియా" నినాదంతో రూపుదిద్దుకున్న ఇలాంటి స్వదేశీ ఆయుధాలు భారత సైన్యానికి కొండంత అండగా నిలవనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+