విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పెట్టుబడులకు సిద్ధం, సీఐఐలో జపాన్ బృందం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నవ్వాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జపాన్ ప్రతినిధుల బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలో జరిగిన సీఐఐ సర్వసభ్య సమావేశంలో జపాన్‌కు చెందిన వాణిజ్య ప్రతినిధుల బృందం పాల్గొంది.

ఈ సందర్భంగా బృందం ప్రతినిధి సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరేక ఇక్కడికొచ్చామని ప్రకటించారు. అంతేకాక ఇక్కడి పరిస్ధితులు తమ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని కూడా వారు తెలిపారు.

Japanese business team at Vijayawada

జపాన్ ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి.... ఒక బృందం ఉండవల్లిలోని వీటీపీఎస్ సందర్శించగా, మరొక బృందం సీఐఐ సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వ్యాపార సంస్థలు పెట్టుకునే అవకాశం ఉంది, ఏ మేరకు పెట్టుబడులు పెట్టవచ్చు, వాటికి కావాల్సిన ఇన్ఫాసె్ట్రక్చర్‌ తదితర వాటిపై జపాన్‌ బృందం అధికారులతో చర్చించారు.

సమావేశ అనంతరం జపాన్ ప్రతినిధుల బృందం గుంటూరు పర్యటనకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం జపాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికి వేత్తలను ఆహ్వానించారు.

English summary
Japanese business team came wednesday to praticipate conclave in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X