ఒడిశా వైపు రైళ్లు రద్దు - దారి మళ్లింపు : ఈ రోజుకు అటు ప్రయాణాలు లేనట్లే : ఎఫెక్ట్ వీటి పైనే..!!
జొవాద్ తుఫాన ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా కు మాత్రం ఇంకా ముప్పు తొలిగిపోలేదు. దీంతో..అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా కేంద్రానికి సహాయక టీంలు తీర ప్రాంతాలకు చేరుకున్నాయి. తీరంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ రోజు మధ్నాహ్నం తుఫాను తీరం దాటే సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుం దని అంచనా వేస్తున్నారు. తుఫాన్ వాయుగుండంగా మారనుండటంతో అన్ని తీర ప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేశారు.

రద్దు చేసిన రైళ్లు ఇవే
జొవాద్ తుఫాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 5న (ఆదివారం) బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్- విశాఖపట్నం (18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్ (20890), భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (22819), భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ (12663), భువనేశ్వర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845) రైళ్లు రద్దు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు
వీటితోపాటు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే తెలిపింది. అలెప్పీ-ధన్బాద్, న్యూ జల్పాయిగురి-చెన్నై సెంట్రల్, సిల్ఘాట్ టౌన్-తాంబారం రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ షెడ్యూల్ ను ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచించింది. జొవాద్ తుఫాన్ శనివారం సాయంత్రానికి బలహినపడి దిశ మార్చుకొని పయనమవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతున్న తుఫాన్ బలహిన పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బలహీనపడినా.. అప్రమత్తంగా
జోవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310, పారాదీప్‌కు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. హ్నానికి ఒడిశాలోని పూరీకి సమీపంలో వాయుగుండంగా మరింత బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమేణా బలహీనపడుతుండటంతో... తీర ప్రాంత జిల్లాల్లు ఊపరి పీల్చుకుంటున్నాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ముప్పు తప్పినా..అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈ రోజు వరకు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే సోమవారం నిర్వహణ పైన ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications