వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జగనన్న చేదోడు’కు సెలబ్రిటీల ప్రశంసలు- జావెద్‌ హబీబ్‌ బిగ్‌ థ్యాంక్స్‌

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించిన జగనన్న చేదోడు పథకంపై రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా విపత్తు వేళ టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆదుకునేందుకు ప్రభుత్వం పది వేల రూపాయల సాయం ప్రకటించడం ఎంతో గొప్ప విషయమని పలువురు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్టులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Recommended Video

#JaganannaChedhodu : Celebrities Big Thanks To AP CM Jagan For Jagananna Chedhodu Scheme

సీఎం జగన్‌ పై ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'జగనన్న చేదోడు' పథకాన్ని ప్రారంభించడంపై జావెద్‌ హబీబ్‌ స్పందించారు. 'కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి' బిగ్‌ థ్యాంక్స్‌ అంటూ 'జగనన్న చేదోడు' పథకంపై జావెద్‌ హబీబ్ ప్రశంసలు జల్లు కురిపించారు.

jawed habibs big thanks to cm jagan for jagananna chedodu scheme

మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మరో సెలబ్రిటీ స్టైలిస్ట్‌ హర్మన్‌ కౌర్‌ అన్నారు. ఇవాళ ప్రారంభమైన జగనన్న చేదోడు పథకాన్ని పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు.

English summary
andhra pradesh govt has launched one of its prestigious scheme jagananna chedodu today. celebrity hair stylists like jawed habib, harmar kaur lauds cm jagan for implementing this scheme, in which tailors, barbers, dhobis will get rs.10,000 one time financial help per year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X