రాజేంద్రుడితో జయసుధ ఢీ: రాజకీయాలు ఒంటబట్టాయా?
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జయసుధ తాజాగా మీడియా ముందుకు వచ్చి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిన వైనం ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. చాలా కాలంగా, సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు అది పూర్తిగా బహిరంగమైంది. ఆశ్చర్యకరం కాకపోయినప్పటికీ జయసుధ మా ఎన్నికల పోటీలోకి వచ్చారు. శాసనసభకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జయసుధ కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చి మొదటి విడత సికింద్రాబాద్ నుంచి గెలిచిన ఆమె పలుమార్లు రాజకీయాలపై విరక్తి ప్రదర్శించారు. శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడే ఆమె పలుమార్లు రాజకీయాల పట్ల తీవ్రమైన విరక్తి ప్రదర్శించారు. అయినా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫ్యాషన్ షోను ఏర్పాటు చేసి, చీరకట్టులోని అందాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు.
తాను డిజైన్ చేసిన కలెక్షన్లను ఆమె జె8 బై జయసుధ పేరుతో హైదరాబాదులోని తాజ్ బంజారాలో ఇటీవలప్రదర్శనకు పెట్టారు. అమ్మాయిల టేస్ట్ గురించి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. వస్త్రవిభ పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఒక సందర్భంలో ఆమె ప్రారంభించారు.తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటపాటల్లో ప్రతిబింబిస్తుందన్నారు. తాను అన్నిరకాల చీరలను ఇష్టపడతానని చెప్పారు. తన మనసుకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొనేస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ మేయర్‌గా ఉన్న కార్తిక రెడ్డితో ఆమెకు పడేది కాదు. పలుమార్లు ఈ వివాదంపై ఆమె కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు తన పైన దాడికి ప్రయత్నించారని జయసుధ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తమ కాన్వాయ్ పైన దాడికి యత్నించారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడ నుండి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు.
ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో..
రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తనకు ఏమీ అర్థం కావడం లేదని, అంతా గందరగోళంగా ఉందని శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడు జయసుధ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. ఏమవుతుందో తెలియడం లేదన్నారు. అంతా అయోమయంగా ఉందని, ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమా గుర్తుకు వస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమం చెలరేగుతూ, రాష్ట్ర విభజన జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వైపు వెళ్తారని భావించిన ఆమె అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు నిలబడ్డారు.
కార్తికరెడ్డితో వైరం..
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్తిక రెడ్డికి వ్యతిరేకంగా ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. తన ప్రత్యర్థి, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సికింద్రాబాద్ సిట్టింగ్ శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడు జయసుధ పట్టుబట్టి కూర్చున్నారు. బండ కార్తిక రెడ్డికి, జయసుధకు చాలా కాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటూ వచ్చింది. బండ కార్తికరెడ్డి తీరుపై జయసుధ చాలా సార్లు మనసు నొచ్చుకున్నారు. వివాదం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. ముఖ్యమంత్రి సర్ది చెప్పడంతో కాస్తా అప్పుడు సద్దుమణిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండ కార్తిక రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తనపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని జయసుధ భావిస్తున్నట్లు సమాచారం
మార్పు తేలేమని నిస్సహాయత
తనలాంటి జయసుధలు రాజకీయాల్లోకి మరో వందమంది వచ్చినా మార్పు తేలేమని సికింద్రాబాద్ శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడు జయసుధ అప్పట్లో రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు. ప్రజల్లో చాలా మంది లంచగొండులేననీ, తనలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా వాళ్లలో మార్పు తీసుకు రాలేరన్నారు. ఎప్పుడైతే జనం రూ.200కు ఓటేస్తున్నారో అప్పుడే అడిగే హక్కు ప్రజలకి పోయిందని వ్యాఖ్యానించారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications