వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై మా వద్ద సొల్యూషన్: జెపి, పొత్తుకు కేజ్రీవాల్ నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)తో కలిసి పని చేయాలనుకుంటున్నామని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ శనివారం అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎఎపి కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16న కేజ్రీవాల్‌తో మరోసారి భేటీ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రెండు పార్టీల మధ్య విస్తృత చర్చ జరగాల్సి ఉందని చెప్పారు.

రాజకీయాల్లో మార్పు తేవడంపై కేజీవ్రాల్‌తో చర్చించానన్నారు. రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ.. తెలంగాణ అవసరమని తాము చెప్పామని, డిల్లీ శాసించడం సరికాదన్నారు. అందరికీ ఆమోదమైన పరిష్కారం తమ వద్ద ఉందని జెపి చెప్పారు. జెపితో భేటీపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాము ఎవరితోను పొత్తు పెట్టుకోమని చెప్పారు. విలీనంపై చర్చించారా అని ప్రశ్నిస్తే.. ఆ విషయం జెపినే అడగాలని విలేకరులకు సూచించారు.

Jayaprakash Narayana

దేశ రాజకీయాల ప్రక్షాళన కోసం లోక్‌సత్తా 18 ఏళ్లుగా కృషి చేస్తోందని జెపి అన్నారు. ఇటీవల ఎఎపి సాధించిన విజయంతో దేశంలో మంచి మార్పు వస్తుందనే విశ్వాసం ఏర్పడిందని, మార్పు కోసం జరిగే పోరాటాన్ని విభజించకూడదని, ఓట్లలో చీలిక లేకుండా ఒకరినొకరు బలోపేతం చేసుకొని, ఏదో ఒక రూపంలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

అది ఏ రకంగా చేయాలి, వాటి విధివిధానాలు ఏమిటి, అన్న అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. ఈ నెల 16న పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు. లోక్‌సత్తా కృషితో దేశంలో ఎనిమిది చట్టాలు, మూడు రాజ్యాంగ సవరణలు జరిగాయన్నారు.

English summary
Loksatta chief Jayaprakash Narayana is trying work with Aam Aadmi party chief Arvind Kejriwal in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X