జగన్ మాటలు వింటే మునగడం ఖాయం: జెసి

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ వారసులే ఖాళీగా ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ ఓట్లు అడగడం సిగ్గు చేటు అని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మరో రెండు లక్షల కోట్లు సంపాదిస్తారని ఆయన విమర్శించారు.
వైయస్ జగన్ ఆశకు హద్దు లేదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన సంక్షేమం, బంధువుల సంక్షేమం మాత్రమే చూసుకునే జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ జెసి దివాకర్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications