ఆశలొద్దు! ఏపీకి ఆ రెండూ రావు: జేసీ సంచలనం, ‘బాబు వల్లే పరువు పోయింది!’
Recommended Video

హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కేంద్ర బడ్జెట్‌లో సరైన న్యాయం జరగలేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శల వేడిని పెంచాయి.
ఓ వైపు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలే పరస్పరం విమర్శలు గుప్పించుకుంటుంటే.. మరోవైపు వైసీపీ ఈ రెండు పార్టీలను విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హోదా, ప్యాకేజీ రావు..
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ రావని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. మీడియా, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంతమేర డబ్బులు రావొచ్చని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఏపీకి పెద్దగా ఏమీ రావని, ఆశలు వదులుకోవాల్సిందే అని ఎంపీ జేసీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఏపీకి సాయం చేసేందుకు కట్టుబడి ఉందని బీజేపీ నేతలు చెబుతుండగా, జేసీ చేసిన వ్యాఖ్యలకు
ప్రాధాన్యత సంతరించుకుంది.

పరువు తీసింది బాబే..
ఇది ఇలా ఉండగా, ఏసీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా పరువు తీసింది మీరా మేమా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబులతో కలిసి ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

పక్కదారి పట్టిస్తున్న బాబు
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పరువు తీసిందెవరో జపాన్ కంపెనీ విషయంలోనే అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు ఇతరులపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ఎంతకైనా తెగిస్తారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎంతటికైనా తెగిస్తారని స్పష్టం చేశారు. తమ అధినేతపై ఎంత ఎదురు దాడిచేసినా ఆయన భయపడరన్నారు. రాష్ట్రం పరువు చంద్రబాబే తీస్తున్నారని , సీఎం పంచాయతీలు చెప్పారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పడంతోనే ఈ విషయం స్పష్టమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

మరోసారి మోసం చేయడానికి..
ప్రత్యేక హోదా సంజీవని అని తాము పోరాటం చేస్తే ప్యాకేజీ ముద్దు అని తప్పుదోవా పట్టించలేదా? అని బాబును నిలదీశారు. మళ్లీ ఈ రోజు హోదా అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని విమర్శించారు. రాష్ట్రం విడదీయడానికి కారణం మీ లేఖ కాదా అని , రాష్ట్రప్రయోజనాల కోసం ఏ రోజైనా ప్రతిపక్షంతో మాట్లాడారా? అని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. ఈ రాష్ట్ర ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది చంద్రబాబేనని దుయ్యబట్టారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications