మూణ్ణెళ్ల క్రితమే: జగన్‌పై జేసీ ఆగ్రహం, ఇవేం మాటలు..

హైదరాబాద్/అనంతపురం: మూడు నెలల కిందటే ప్రజలు నరకాసురుడి పాలన వద్దని వైయస్ జగన్‌ను ఇంటికే పరిమితం చేశారని, నవ్యాంధ్ర నిర్మాణం చంద్రబాబు నాయుడుతో సాధ్యమని ఆయనకు పట్టాభిషేకం చేశారని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న నరకాసుర వధ పైన విలేకరులు ప్రశ్నించగా ఆయన జగన్ పైన మండిపడ్డారు. రుణమాఫీ చేయడం అసాధ్యమన్న జగన్ ప్రస్తుతం మాట్లాడం సరికాదన్నారు.

JC Diwakar Reddy lashes out at YS Jagan

మరోవైపు, జగన్‌ను జనం క్షమించరని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శ్రీకాళహకస్తిలో అన్నారు. జగన్ మాట్లాడుతున్న తీరు, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందనిపిస్తోందన్నారు. రుణమాఫీ చేయడం జగన్‌కు ఇష్టం లేదన్నారు.

ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరుతుంటే.. ఆయనకు మాత్రం బాధ కలుగుతోందన్నారు. రుణమాఫీ చేయకముందు చేయలేరని, చేశాక అంతా చేయలేదని అర్థరహిత విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే రైతులు, డ్వాక్రా మహిళలే తగిన బుద్ధఇ చెబుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+