నాకు తెలుసు.. జగన్ చెల్లినే సహించరు, బీజేపీ గెలుస్తుంది కానీ: మోడీపై జేసీ

Recommended Video

    జగన్ పై తీవ్రంగా మండిపడ్డ జే.సి దివాకర్ రెడ్డి

    విశాఖపట్నం: తనకు పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ నేతలు విశాఖపట్నంలో ఒక్కరోజు దీక్ష చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన జేసీ, అనంతరం మాట్లాడారు.

    మరో అయిదేళ్లు టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరముందని చెప్పారు. బీజేపీతో కలిసి వెళ్లవద్దని చంద్రబాబుకు ముందే చెప్పానని అన్నారు. జగన్ వెంట నడుస్తున్న జనమంతా డబ్బులు ఇస్తే వచ్చిన వారేనని మండిపడ్డారు.

     అప్పటి నుంచే మోడీకి బాబు అంటే కోపం

    అప్పటి నుంచే మోడీకి బాబు అంటే కోపం

    వాజపేయిని కూడా ప్రధానిని చేయడంలో చంద్రబాబు తనవంతు పాత్ర పోషించారని జేసీ అన్నారు. చంద్రబాబు అంటే వాజపేయికి చాలా గౌరవం అన్నారు. అలాంటి చంద్రబాబు వెళ్లి సార్.. నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే శాంతిభద్రతల విఘాతం కలుగుతుందని, దేశం ముక్కలు చెక్కలయ్యే ప్రమాదం ఉందని చెప్పారని, అప్పటి నుంచి చంద్రబాబుపై మోడీకి కోపం ప్రారంభమైందని, గోద్రా అల్లర్ల ఘటనను ఉద్దేశించి అన్నారు.

     జగన్ చెల్లిని, భార్యనే సహించలేదు

    జగన్ చెల్లిని, భార్యనే సహించలేదు

    వైయస్ రాజశేఖర రెడ్డి కంటే చిన్నవాడైన జగన్‌ను నేను సార్ అనాలా.. నాకు ఆ ఖర్మ ఎందుకు అని జేసీ అన్నారు. తాను వైసీపీలో చేరడానికి డబ్బులు అడిగారని, పైగా గౌరవించాలా అని ప్రశ్నించారు. నీ చెల్లెనే నువ్వు సహించలేకుంటే ఇంకా ఎవరిని సహిస్తావని అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజకీయాల్లో ఎదుగుతుందని సొంత చెల్లెలిని పక్కన పెట్టారన్నారు. షర్మిల పార్టీని లీడ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారన్నారు. జగన్ బయటపడలేదు కానీ రాజకీయాలకు భార్యను కూడా పెట్టాల్సినంత దూరం పెట్టారన్నారు. నాకు ఆ కుటుంబం గురించి కొద్దిగా తెలుసు కాబట్టి చెబుతున్నానని అన్నారు. కుటుంబంలోని వారినే సహించలేని జగన్.. నన్ను, ఇతరులను సహిస్తారా అన్నారు. కానీ చంద్రబాబు అందుకు వ్యతిరేకమన్నారు.

     బీజేపీ గెలుస్తుంది, కానీ మోడీ ప్రధాని కారు

    బీజేపీ గెలుస్తుంది, కానీ మోడీ ప్రధాని కారు

    మనకు ఎంపీ అనే హోదా తప్ప మరే హోదా లేదని ఆవేదన వ్యక్తం జేసీచేశారు. బీజేపీ సర్కార్‌కు నిజాయితీలేదన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలవవచ్చునని, కానీ నరేంద్ర మోడీ మాత్రం మళ్లీ ప్రధాని కాలేడని జేసీ జోస్యం చెప్పారు. అన్నీ బాగుంటే మరొకరు ప్రధాని అవుతారన్నారు. రైల్వే జోన్ కోసం దీక్ష చేస్తున్న అవంతి శ్రీనివాస్‌ను తాము డాన్ అని పిలుచుకుంటామని చెప్పారు. ఆయన (మోడీ) రైల్వే జోన్ ఇవ్వరని చెప్పారు.

    జగన్ చస్తే ఆ మాట అనరు

    జగన్ చస్తే ఆ మాట అనరు

    నిన్న అనంతపురంలో వైసీపీ వంచన దీక్షలో మాట్లాడుతూ ఆ పార్టీ ఎంపీలు ఒకరిద్దరు మాట్లాడుతూ తాము బీజేపీతో కలువమని ప్రకటన చేశారని, కానీ చెప్పాల్సిన జగన్ మాత్రం చెప్పడం లేదని జేసీ అన్నారు. జగన్ చస్తే మోడీ మోసం చేశారని చెప్పరన్నారు. పుట్టిన ఊరు, పుట్టిన భూమి, తాలుకా, జిల్లా, రాష్ట్రం, దేశంపై ప్రేమ సహజం అన్నారు. ఇటీవల సీఎం రమేష్ ఉక్కు పరిశ్రమ గురించి దీక్ష చేస్తుంటే జగన్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. సొంత జిల్లాపై ప్రేమ లేని జగన్ ఇక విశాఖకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+