నంద్యాలలో గెలుస్తాం కానీ, వైసిపికి గబ్బు, జగన్‌తో మోడీ కలవరు: జెసి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, కానీ మెజార్టీ తక్కువగా వస్తుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికలు: తెలుగుదేశం పార్టీలో ఆందోళన, కారణాలివే

అసెంబ్లీ సీట్లు పెరగవు

అసెంబ్లీ సీట్లు పెరగవు

నంద్యాల ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తు తదితర అంశాలపై జెసి స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

మోడీకి విలువలున్నాయి జగన్‌తో కలవరు

మోడీకి విలువలున్నాయి జగన్‌తో కలవరు

ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని విలువలు ఉన్నాయని, వైసిపి అధినేత జగన్‌తో ఆయన కలువరని తేల్చి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత సహజమేనని చెప్పారు. కాబట్టి మెజార్టీ తగ్గుతుందని జెసి ఆన్నారు.

జగన్ సభ తర్వాత వైసిపి గబ్బు పట్టింది

జగన్ సభ తర్వాత వైసిపి గబ్బు పట్టింది

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలోనే అభివృద్ధి పనులు చేయడం లేదని జెసి చెప్పారు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయరని చెప్పారు. నంద్యాలలో జగన్ సభ తర్వాత వైసిపి గబ్బు పట్టిందని మండిపడ్డారు.

టిడిపి -బిజెపి కలిసే ముందుకు

టిడిపి -బిజెపి కలిసే ముందుకు

చంద్రబాబు అపర చాణక్యుడు అని జెసి అన్నారు. 2019లో టిడిపి - బిజెపిలు కలిసి నడుస్తాయని తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి కలిసే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party Anantapuram MP JC Diwakar Reddy on Tuesday said that TDP candidate Bhuma Brahmananda Reddy will win bypoll. He blamed YSRCP chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...