2019లో పోటీచేయను, పల్లెకు మంత్రి పదవి పోవడానికి....జెసి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

పుట్టపర్తి: భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ప్రకటించారు. నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాలేదేమో కానీ, ప్రస్తుతం ఎన్నికల్లో ప్రలోభాలు సహజమేనని ఆయన అన్నారు.

నంద్యాల: ఓట్ల చీలిక , రాయలసీమ సెంటిమెంట్, నష్టమెవరికీ?

రాజకీయాల్లో నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిత్వం ఉందని జెసి దివాకర్‌రెడ్డికి పేరుంది. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే అంశాలపై ఆయన స్పందించారు.

సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న జెసి దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ప్రకటించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అనంతపురం జిల్లాకు సాగు నీరు అందకపోతే తాను కట్టలను తెంపి నీటిని విడుదల చేస్తానని జెసి చెప్పారు.

పల్లె రఘునాథ‌రెడ్డి మంత్రి పదవి పోవడానికి కారణమిదే

పల్లె రఘునాథ‌రెడ్డి మంత్రి పదవి పోవడానికి కారణమిదే

పల్లె రఘునాథరెడ్డి మెతక మనిషి.మంత్రిగా ఎఫెక్టివ్‌గా పనిచేయలేకపోయారు. అందరినీ సంతృప్తి పర్చలేదు. కొందరినైనా సంతృప్తిపర్చితే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుందని జెసి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే పల్లె రఘునాథ‌రెడ్డి మంత్రి పదవి పోయిందని జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు.

Telangana Police arrested AP TDP MLA JC Prabhakar Reddy at RTA Office | Oneindia Telugu
50 శాతం అభ్యర్థులను మార్చాల్సిందే

50 శాతం అభ్యర్థులను మార్చాల్సిందే

ప్రస్తుతమున్న ఎంపి, ఎమ్మెల్యేల్లో 50 శాతం అభ్యర్థులను మార్చాల్సిందేనని జెసి దివాకర్‌రెడ్డి టిడిపి నాయకత్వానికి సూచించారు. అభ్యర్థులను మార్చితేనే వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం సునాయాసమౌతోందన్నారు. లేకపోతే కొంచెం కష్టంగా పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలకు నీటి కేటాయింపుల్లో న్యాయం జరగకపోతే తానే ముందుండి కాలువను తెంపుతానని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను

2019 ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో జెసి దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు తనయుడి రాజకీయ రంగ ప్రవేశం కోసం జెసి దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి వీలుగా జెసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రలోభాలు సాధారణమే

ప్రలోభాలు సాధారణమే

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టడం సాధారణమేనని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నెహ్రు హయంలో ప్రలోభాలు జరగలేదేమో కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలు సాధారణమయ్యాయనే అభిప్రాయాన్ని జెసి దివాకర్‌రెడ్డి వ్యక్తం చేశారు. నంద్యాలలో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anatapuram MP JC Diwakar reddy sensational comments on former minister Palle Raghunath reddy.I won't contest in 2019 elections
Please Wait while comments are loading...