'వైసీపీలో జగన్ ఒక్కడే': రాయల తెలంగాణపై జేసీ సంచలనం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఒక్కరే మిగులుతారని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' పై కూడా ఆయన స్పందించారు. వైసీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ వైఖరి నచ్చకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల పరిణామాల దృష్ట్యా రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుండేదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పశ్చాతాపడుతున్నారని అన్నారు. రాయల తెలంగాణను ఏర్పాటు చేసినట్లయితే సీమకు కష్టాలు వచ్చేవికావని అన్నారు.












Click it and Unblock the Notifications