అస్త్రసన్యాసం: పార్టీ మారే ఆలోచన, దూరమని జెసి ట్విస్ట్

తాము తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలలోకి వెళ్తామని ప్రచారం సాగుతోందని కానీ, తాము ఇప్పటి వరకు ఎవరితోను మాట్లాడలేదని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెసు పార్టీని వీడటం బాధాకరమేనని అయితే, రాష్ట్ర విభజన దృష్ట్యా కార్యకర్తల నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందన్నారు. ఆ కారణంగానే పార్టీ మారే ఆలోచన చేస్తున్నామన్నారు. అనంతపురంలో కాంగ్రెసు పార్టీ కంటే దివాకర్ రెడ్డి బలమే ఎక్కువ అన్నారు.
అస్త్రసన్యాసం!
తన సోదరుడు జెసి దివాకర్ రెడ్డిని ఈ విషయమై అడగగా తన వయసు అయిపోయిందని చెప్పారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమ పిల్లలు రాజకీయాల్లోకి వస్తారన్నారు.
జెసి సోదరులు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీల నేతలు మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తామెవరితోను మాట్లాడలేదని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందువల్ల జెసి సోదరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి తమ తనయులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కాగా, జెసి తనయుడు పవన్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో తాడిపత్రి నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications