జేసీ కన్నీరు, అన్యాయం చేసారు - చంద్రబాబు చెప్పినా...!!

ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తన పైన అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని వాపోయారు. తనకు అన్యాయం జరిగిందన్నారు. తనకు అన్యాయం చేసిన వారి విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబును తాను వ్యతిరేకం కాదని..వారి విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

జేసీ కన్నటి పర్యంతం
జగన్ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. దీని పైన ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తమ కుటుంబంపై దొంగలుగా ముద్ర వేసి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏప్రిల్ ఒకటి 2017 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని... రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ట్రాల్లో తీర్పును ఇచ్చాయని గుర్తు చేసారు. తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. తాను అడిగితే కేసు నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు చేస్తారన్నారు.

JC Prabhakar Reddy made sensational comments on Officers who supports YSRCP

వారిని వదిలేది లేదు
కానీ తాను ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తానని చెప్పుకొచ్చారు. రవావాఖ కమిషనర్ సీతారామాంజనేయులు... పేర్ని నాని... ఇతర అధికారులు దారుణంగా వ్యవహరించారన్నారు. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేసారు. విచారణ జరపాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తా నంటూ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఏపీని చెడకొట్టిందే ఐఏఎస్, ఐపీఎస్ లే నని కీలక వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా తమ వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని చెప్పారు.

తిరిగి ఇవ్వాల్సిందే
రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులేనని వ్యాఖ్యానించారు. తన బస్సులన్నింటిని రవాణా శాఖ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. తమ పరువు తీసే బయటి తిరగకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తనను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి తిండి కూడా పెట్టలేదని ఫైర్ అయ్యారు. ఏపీలో తమ దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గరా లేవన్నారు. కమిషనర్, డీటీసీ శివప్రసాద్ ఇళ్ల వద్ద కూర్చుంటానని ప్రకటించారు. బస్సులన్నీ తుప్పుపట్టాయన్నారు. రెండు బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారని చెప్పారు. తన బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టుకు లాగుతానన్నారు. తన కొడుకు, కోడలు ఎస్పీ కార్యాలయంలో తాను తన భార్య డీటీసీ ఆఫీస్ వద్ద కూర్చుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+