టిడిపికి విధేయుడ్ని కాను: జెసి ప్రభాకర్ రెడ్డి, రోజాపైనా వ్యాఖ్య
అనంతపురం: తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే విధేయుడిని గానీ తెలుగుదేశం పార్టీకి కాదని తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వానవోలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు తనకు పిలిచి టికెట్ ఇచ్చారని, చంద్రబాబుకు విజన్ ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై కూడా ఆయన స్పందించారు. తాను అసెంబ్లీలో ఉండటం దురదృష్టకరమని, ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాధపడుతున్నానని అన్నారు.

ఎంతో హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాల్సిన సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవచేసే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తనకు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో బంధుత్వం, స్నేహం ఉన్నందున వారు తనను కలుస్తున్నారని తెలిపారు. అలాగని ఎవరికైనా భయపడి వారితో మాట్లాడకుండా ఉండలేనని చెప్పారు.












Click it and Unblock the Notifications