టీఆర్ఎస్ నోటు లేకుండా గెలిచిందా: జేసీ, 'కేసీఆర్ మెడకు ట్యాపింగ్'
హైదరాబాద్: నోటు లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్క సీటైనా గెలిచాడా అని అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఘాటుగా ప్రశ్నించారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయని వారెవరో చెప్పాలన్నారు.
అయితే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని గ్రామాల్లో ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. నదులను అనుసంధానం చేస్తేనే జిల్లాలకు తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దళితులను పావుగా వాడుకున్నారు: జూపూడి
రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు కేసీఆర్ దళితులను పావుగా వాడుకున్నారని జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. దళితుడైన సెబాస్టియన్ ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న భాష సరికాదన్నారు.
కేసీఆర్ తన స్థాయికి తగిన భాష మాట్లాడటం లేదన్నారు. ధర్నాలు చేసే కార్యకర్తలు ఎలాంటి భాషలు మాట్లాడుతారో కేసీఆర్ అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందన్నారు. కర్నాటకలో రామకృష్ణ హెగ్డే ఉదంతం గురించి కేసీఆర్ తెలుసుకుంటే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications