హోదా రాదని చెప్పానుగా: జేసీ, రాకింగ్ స్టార్.. సర్‌ప్రైజ్ చేసిన రావెల
అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా రాదని, ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని అనంతపురం ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తారని జేసీ చెప్పారు. బీజేపీ నేతలు కూడా ఆ విషయం చెబుతోన్న విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి 90 గ్రాంటుగా వస్తాయన్నారు. ఇచ్చిన నిధుల్లో మనం 10 శాతమే కట్టవలసి ఉంటుందన్నారు. కానీ హోదా రాకుంటే అలా ఉండదని అభిప్రాయపడ్డారు. హోదాను మించిన ప్యాకేజీ రానుందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

రాక్ స్టార్ అవతారమెత్తిన మంత్రి రావెల
మంత్రి రావెల కిషోర్ బాబు స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా రాక్ స్టార్ అవతారం ఎత్తారు. ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు రాక్ స్టార్ అవతారమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో జరిగిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రావెల పాల్గొన్నారు.
ఈ సమయంలో స్థానిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలోని గిటార్‌ను చేతికి తీసుకున్న రావెల.. దానిని వాయిస్తూ అందర్నీ అలరించారు. అంతేకాదు, విద్యార్థులతో కలసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు.
అనంతరం ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయన్నారు. ఆ ప్రభావం విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. కాగా, రావెల గిటార్ వాయించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు.












Click it and Unblock the Notifications