వ్యతిరేకం కాదు కానీ, నెలలో క్లారిటీ: శీలం ధీటుగా, సెగ

అయితే ఆ సమావేశానికి హోటల్ యాజమాన్యం నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. విభజన వాదం వినిపిస్తున్న జెడి శీలం ప్రెస్ మీట్‌కు అనుమతి ఇస్తే బాగుండదని సమైక్య ఐకాస హెచ్చరించినందు వల్లనే హోటల్ యాజమాన్యం విలేకరుల సమావేశానికి అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు జెడి శీలం బెజవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో సమైక్యవాదులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన ధీటుగా స్పందించారు. ఏ కారణం వల్ల సమైక్యం కావాలనుకుంటున్నామో మనం చాలాసార్లు చెప్పామని, దానిని రాతపూర్వకంగా ఇవ్వాలని తాను కోరానని అది తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటిలో పలు ఆప్షన్స్ ఉన్నాయని అందులో ఒక దానిని కేంద్రం తీసుకుందన్నారు. విభజన జరిగినా సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు.
తమకు కాంగ్రెసు పార్టీ, ప్రజలు ముఖ్యమన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఊరట కలుగుతుందన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీని దోషిగా చిత్రీకరించవద్దన్నారు. విభజనకు అనుకూలంగా ఎవరు లేఖ ఇచ్చారని ప్రశ్నించారు. అందరు ఒప్పుకున్నాకే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
తాము ఎప్పుడు యూ టర్న్ తీసుకోలేదన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పామన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో రాదో తనకు తెలియదన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. అయితే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
తెలంగాణ ప్రక్రియ ఆరంభం మాత్రమే, నెల రోజుల్లో క్లారిటీ
తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభం మాత్రమేనని అంతం కాదని జెడి శీలం చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి ఒట్లు పడతాయన్నారు. చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెసు ఒక్కటే అన్నారు. ప్రజల మనోభావాలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యం ఒక్క కాంగ్రెసులోనే ఉందన్నారు. వచ్చే నెలలో ప్రశాంతత ఏర్పడుతుందని, అప్పుడు కూర్చొని మాట్లాడుకుందామన్నారు. నెల రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.
ఇతర నేతలు, ఇతర పార్టీలపై తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. తాము సందిగ్ధంలో ఉన్నామని చెప్పారు. తనకు అవకాశం ఉన్నంత వరకు విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తానని, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమే అన్నారు. సమైక్యవాదులు అడ్డుకోవడంపై ప్రశ్నించగా.. తనను తన ప్రజలు కాక ఇంకెవరు అడ్డుకుంటారని చెప్పారు. తనను కొట్టే వారు పుట్టలేదన్నారు.
టికి వ్యతిరేకం కాదు కానీ
తాను విభజనకు వ్యతిరేకం కాదని కానీ సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియా దృష్టికి తీసుకు వెళ్తామని జెడి శీలం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంత పరిధిని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలన్నారు. రాజధాని పైన స్పందిస్తూ.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications