అవకాశమివ్వండి, మోడీ అమరావతి రాకను స్వాగతిస్తున్నాం: శీలం
విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన మాట్లాడేందుకు సభలో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ రాజధాని శంకుస్థాపనకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ప్రధాని మోడీ తన పర్యటనలో ప్రత్యేక హోదా పైన స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకోవాలని కోరారు. ఏపీ అభివృద్ధికి పార్టీలన్నీ కలిసి రావాలని లేఖలో కోరారు.

ఆధ్మాతిక శోభతో విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆధ్మాత్మిక శోభతో విరాజిల్లుతోంది. దసరా పర్వదినం ప్రారంభమైన సందర్భంగా భక్తుల తాకిడితో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. తొలి రోజున శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికాలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని భవానీ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్ఠించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన కుంకుమపూజలు నిర్వహించారు.
మహామండపంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. సాయంత్రపు సమయంలో దర్గమ్మకు మహానివేదన అందించి అనంతరం పంచ హారతులు ఇస్తారు. రాత్రి ఏడు గంటల తర్వాత నగర ప్రజల రాకతో రద్దీ పెరిగే అవకాశముంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications