భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ? వీళ్లిద్దరి కన్నా ఎక్కువ నష్టం ఎవరికంటే ?
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) లో భాగంగా రేపు సాయంత్రం కొలంబోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు (india pakistan match) తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొలంబోకు ఇప్పటికే భారత్, పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాల నుంచీ అభిమానులు క్యూ కట్టారు. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. దీంతో మ్యాచ్ రద్దయితే ఏం జరగబోతోందన్న చర్చలు జరుగుతున్నాయి.
కొలంబోలో జరిగే భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేస్తోంది. ఇవాళ కూడా కొలంబోలో వర్షం జల్లులు పడుతున్నాయి. రేపు ఉదయం పూట వర్షం కురిసే అవకాశాలు 65 శాతం ఉన్నాయని వాతావరణశాఖ చెబుతోంది. మధ్యాహ్నం అంతా కొలంబోలో ఉరుములు, ఆకాశం భారీ మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో మాత్రం వర్షం పడే అవకాశాలు 25 శాతానికి తగ్గుతాయట. మ్యాచ్ మొదలయ్యే సమయంలో మాత్రం వర్షం కురిసే ఛాన్స్ 49 శాతం నుంచి 65 శాతం ఉందంటున్నారు. దీంతో ఓవర్లు కుదించి ఆడించే అవకాశముంది.

అయితే టీ20 మ్యాచ్ ఫలితం రావాలంటే మాత్రం ప్రతి జట్టూ కనీసం ఐదు ఓవర్లు అయినా ఆడాల్సి ఉంటుంది. ఈ ఓవర్లు కూడా ఆడించే పరిస్దితి లేకపోతే మాత్రం మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అప్పుడు రెండు జట్లకూ తలో పాయింట్ కేటాయిస్తారు. ఎందుకంటే గ్రూప్ దశ మ్యాచ్‌లలో దేనికీ రిజర్వ్ డే ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే తలో రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్-పాకిస్తాన్ జట్లు ఐదేసి పాయింట్లు సాధించి గ్రూప్ టేబుల్ లో సమంగా నిలుస్తాయి. మిగతా మ్యాచ్ లు, రన్ రేన్ ఆధారంగా గ్రూప్ 8కు వీరిలో ఒకరు లేదా ఇద్దరు అర్హత సాధిస్తారు.

అయితే ఈ మ్యాచ్ జరగకపోతే అసలు నష్టపోయేది భారత జట్టూ, పాకిస్తాన్ జట్టూ కాదట. వీరిద్దరి కన్నా ఎక్కువగా ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టారే నట. ప్రకటనల రూపంలో ఈ మ్యాచ్ ద్వారా దాదాపు 300 కోట్ల ఆదాయం సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్న జియో హాట్ స్టార్ కు ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం భారీ ఎదురుదెబ్బ ఖాయం. ఆ తర్వాత
మ్యాచ్ జరగనందుకు ప్రేక్షకులకు టికెట్ల డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారా శ్రీలంక బోర్డు నష్టపోతుందట. ఇంకా చాలా మంది నష్టపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అసలే ఈ మ్యాచ్ జరగకపోతే మొత్తం క్రికెట్ వ్యవస్దే కుప్పకూలిపోతుందంటూ ఐసీసీ దీన్ని ఎలాగైనా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్ ను ఒప్పించింది. ఇప్పుడు వర్షం రూపంలో అందరి ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ లోనూ ఆందోళన పెరుగుతోంది.












Click it and Unblock the Notifications