విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ కౌంటర్: 'బాబుకు మతిమరుపు, బాలకృష్ణ మానసిక పరిస్థితి బాలేదు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: 'నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే ప్రజలు చేయాల్సింది ఒక్కటే. ఎక్కడ కనిపిస్తే అక్కడ అవినీతి చంద్రబాబును చెప్పులతో కొట్టడమే. అప్పుడు తప్ప ఆయనకు బుద్ధిరాదు' అని సీఎం చంద్రబాబుపై, వైసీపీ నేత వైయస్ జగన్ అనంతపురం జిల్లా పర్యనటలో చేసిన వ్యాఖ్యలివి.

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో అంతే వేగంగా ప్రతిస్పందించారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాను మరిచి రోడ్లపై పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి పరిటాల సునీత ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ సంస్కార హీనుడని విమర్శించారు.

జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. రాజారెడ్డిని జగన్ ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నారని మండపడ్డారు. చంద్రబాబుపై జగన్ ప్రయోగించిన బాష అభ్యంతరకంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేత జోగి రమేశ్ కౌంటర్‌ ఇచ్చారు.

jogi ramesh doubt on cm chandrababu naidu mental condition

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని అన్నారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందని, ఒక గంటలో చెప్పింది మరో గంటలో మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన చంద్రబాబును హామీల అమలపై చేతులెత్తేడయడంతో ప్రశ్నిస్తే తప్పేముందని అన్నారు. బూటకపు వాగ్దానాలతో ప్రజల గుండెల్లో గునపాలు గుచ్చితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఒక్క సంతకాన్నైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన పాడిన పాడే పాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉందని అన్నారు. విజయవాడ వేదికగా చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే ఏమీ చేయలేక హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేక హోదాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని అన్నారు.

రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తలకు అమ్ముకుని, బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితిపై కూడా అనుమానం కలుగుతోందని జోగి రమేశ్ అన్నారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాలేదని ఐదు ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలు చూపిస్తామన్నారు.

English summary
ysrcp leader jogi ramesh doubt on cm chandrababu naidu mental condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X