జనసేనలోనే జానీ మాస్టర్..పార్టీ సింబల్‌తో దర్శనం (వీడియో)
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు గురించి తెలిసిన విషయమే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 36 రోజులు జైలు జీవితం గడిపిన జానీ మాస్టర్ గురువారం బెయిల్‌పై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకొచ్చే సమయంలో జానీ మాస్టర్ మెడలో రెడ్ కలర్ టవల్ దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు రెడ్ కలర్ టవల్ ట్రేడ్ మార్క్ అన్న విషయం తెలిసిందే.

దీంతో జానీ మాస్టర్.. జైలు నుంచి వచ్చే సమయంలో ఆయన రెడ్ కలర్ టవల్‌తో కనిపించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో జానీ మాస్టర్.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అటు జనసేన సైతం తెలివిగా జానీ మాస్టర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే సూచించింది.
#JaniMaster was released from Chanchalguda Jail after 36 days with bail. pic.twitter.com/4OUY7n6M7M
— Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) October 25, 2024
దీంతో జానీ మాస్టర్‌ను జనసేనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు జానీ మాస్టర్ సైతం రెడ్ కలర్ టవల్‌తో కనిపించి, తాను ఇంకా జనసేనలోనే ఉన్నారని చూపించినట్టు అయింది. ఇక జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు నమోదు కావడంతో ఆయనకు వచ్చిన జాతీయ అవార్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఇక జైలుకు వెళ్లడంతో పుష్ప-2లో ఆయన చేయాల్సిన సాంగ్‌ను మరొకరితో చేయించామని చిత్ర నిర్మాతలు ఇటీవలే తెలిపారు.












Click it and Unblock the Notifications