హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌కల్యాణ్ వస్తే ప్రచార, నాయకత్వబాధ్యత: హడావుడే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... లోక్‌సత్తా పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా ఉందట. ఆయన పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. పవన్ లోక్‌సత్తాలో చేరితే ప్రచార, నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమని జెపి చెబుతున్నారు.

పవన్ కల్యాణ్‌కు చాలామంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా రాజకీయ పార్టీ పెడితే ఆయన అభిమానులు ఓటు వేస్తే చాలు.. అన్న వాదన కూడా గతంలో వినిపించింది. లక్షలాది మంది అభిమానులు గల పవన్.. ప్రజాజీవితంలోకి వచ్చి పోరాటంలో భాగస్వాములు కావాలని లోక్‌సత్తా చీఫ్ జెపి కోరుతున్నారు.

JP welcomes Pawan in to politics

సమాజం బాగుపడాలని తపన ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయనకు లక్షలాది మంది అభిమానులున్నారని, అలాంటి వ్యక్తి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి, నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జెపి చెబుతున్నారు. ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెబుతున్నారు.

ఆ భేటీలు హడావుడే

కాగా, పవన్ కల్యాణ్‌తో తోట త్రిమూర్తులు, పవన్‌కు చెందిన పలువురు వంగా గీతతో మాట్లాడారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అదంతా కేవలం హడావుడేనని చెబుతున్నారు. అయితే తోట త్రిమూర్తులు పవన్‌ను పాత పరిచయాల కారణంగా కలుద్దామని భావించారట. ఈ విషయమై ప్రచారం జరగడంతో ఆయన తర్వాత కలుస్తానని చెప్పారని తెలుస్తోంది.

English summary
Lok Satta chief Jayaprakash Narayan has welcomed Pawan Kalyan into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X