ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలపై మంచి పట్టున్న సంగతి అందరికి తెలిసింది. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం.. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను టీడీపీ దూరం పెట్టడంతో ఆయన అభిమనులు కొందరు జగన్‌కు మద్దతు ప్రకటించారు.

వైసీపీ సభల్లో ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు సందడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ తరుఫున ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారనేది ఈ వార్త సారాంశం. దీనికి సంబంధించిన ఫొటో కూడా టీడీపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో టీడీపీ ఎన్నికల గుర్తు ఉన్న షర్ట్‌ను ఎన్టీఆర్ ధరించారు.
పిల్ల హుక్ పేటీఎం గాళ్ల కోసం….
— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) April 22, 2024
క్లారిటీ వచ్చేసింది గా….
మన రక్తం…మన బిడ్డ..🔥🔥🔥 pic.twitter.com/bIiQRi2KAH
ఈ షర్ట్‌తో తారక్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. 'డెనిమ్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్, బ్లాక్ క్యాప్‌తో తెల్లటి చొక్కా' ధరించి కనిపించారు. దీంతో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఎక్కుడున్న మావోడంటూ టీడీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరీ టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నట్టుగా ఎన్టీఆర్ పార్టీ తరుఫున ప్రచారం నిర్వహిస్తారో లేదో చూడాలి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications