జూ.ఎన్టీఆర్ 'టెంపర్': టీడీపీలో మళ్లీ, ఫ్యాన్స్‌ను బుజ్జగించేందుకా?

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 2015 కీలకమైన సంవత్సరంగా చెబుతున్నారు! ముఖ్యంగా అతను తెలుగుదేశం పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయం కూడా అందులో చాలాచాలా ముఖ్యమైనదని అంటున్నారు. 2009లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేయడం, ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండి టీడీపీలో లోకేష్, జూనియర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగడం, 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం తెలిసిందే.

టీడీపీకీ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుండి ఆయన సినిమాలు అంతగా ఆడలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ గెలిచిన అనంతరం జూనియర్ తన తండ్రి హరికృష్ణ సూచన మేరకు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.

 Jr NTR’s Telugudesam membership dilemma

రెండు రాష్ట్రాల్లో కలిసి టీడీపీ మెంబర్‌షిప్ యాభై లక్షలు దాటింది. అయితే, టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించుకున్నారని తెలుస్తోంది. అయితే, అతను కొంత అయిష్టంగానే చేసి ఉండవచ్చునని అంటున్నారు. అతను హైదరాబాదులో కాకుండా నిమ్మకూరులో రెన్యూవల్ చేసుకున్నారని తెలుస్తోంది.

ఇది కూడా అతను వ్యూహాత్మకంగానే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీకీ దూరంగా జరిగారనే వార్తలు వచ్చాక ఎన్టీఆర్ సినిమాలు అంతగా ఆడలేదు. పైగా ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా నిమ్మకూరులో పార్టీ సభ్యత్వం తీసుకొని ఉంటారని అంటున్నారు.

అంతేకాకుండా తన చిత్రాలను బ్యాన్ చేస్తున్న ఓ వర్గాన్ని లేదా నందమూరి అభిమాన గణాన్ని బుజ్జగించే ఉద్దేశ్యం కూడా కావొచ్చంటున్నారు. హరికృష్ణ, హీరో కళ్యాణ్ రామ్‌లు కూడా తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఎన్టీఆర్ నిమ్మకూరులో సభ్యత్వం రెన్యూవల్ చేసుకోవడానికి పలు కారణాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+