బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లోని న్యాయమూర్తులు నివాస సముదాయంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొని చెత్తను ఎత్తివేశారు.

హైకోర్టు రిజిస్ట్రార్లు ముత్యాల నాయుడు, జగన్నాధం, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని, తెలంగాణ వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ శ్రీసుధ, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీఈఓ న్యాయమూర్తి డి. సుబ్రమణ్యం, ఫస్ట్ క్లాస్ అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జి లక్మీపతి, ఇండస్ట్రీయల్ ట్రైబ్యునల్ ఛైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీఈఓ న్యాయమూర్తి డి. సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం ప్రాధమిక హక్కు.. దీన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. న్యాయమూర్తి రజని మాట్లాడుతూ నెలలో ఒకరోజు ఇలాంటి కార్యక్రమం చేపడితే పరిసరాలు శుభ్రంగా మారతాయని అన్నారు.












Click it and Unblock the Notifications